Nagababu : నాగబాబుకి మళ్లీ బ్రేక్ వేశారా.. రాజ్యసభకు ఆ ముగ్గురు వెళ్లనున్నారా..!
Nagababu : ఆంద్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడం మనం చూశాం. ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్ హర్యానాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇవన్నీ ఉపఎన్నికలే. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూడా వైసీపీ నుంచి విజయం సాధించిన రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో తిరిగి ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇలా మూడు స్థానాలకు గాను తెలుగుదేశం జనసేన బాజాపామూడు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురిని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య లకి రాజ్యసభ పదవులకు పోటీ చేసే అవకాశాలు లేనట్లే. ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ సీట్లలో కూటమి పార్టీల్లో ఒకటి అయిన జనసేనకు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చు.
Nagababu : నాగబాబుకి మళ్లీ బ్రేక్ వేశారా.. రాజ్యసభకు ఆ ముగ్గురు వెళ్లనున్నారా..!
జనసేన పార్టీ తరపున నాగబాబును ఎంపీగా పంపిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో త్యాగం చేశారు. పొత్తుల్లో సీట్లు త్యాగం చేసిన వారికి అవకాశాలు కల్పిస్తున్నందున నాగబాబుకు ఎంపీ సీటు కాయమని జనసేన వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే కొన్ని సమీకరణాలు మారుతున్నాయి.ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో బీదా మస్తాన రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయటం ఖాయమైంది. ఆ హామీతోనే మస్తాన రావు వైసీపీకి రాజీనామా చేసారు.
మూడు స్థానాల్లో బీసీలకు ఇవ్వకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో, బీదాకు ఖాయమని చెబుతున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయదేవ్ అభ్యర్దిత్వం పైన పవన్ సైతం అంగీకారం తెలిపారని సమాచారం. ఇదే స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ సైతం ఆశిస్తున్నారు. అదే విధంగా సానా సతీశ్ పేరు ప్రముఖంగా రేసులోకి వచ్చింది. అటు టీడీపీ, జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీశ్ కు మద్దతు లభిస్తోంది. ఎన్నికలు జరుగుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు పూర్తి కాలం పదవి లేదు. ఒక రాజ్యసభ పదవికి కేవలం రెండేళ్లే చాన్స్ ఉంది . ఒక సభ్యుడి పదవి 2026, మరో ఇద్దరి పదవులు 2028కి పూర్తవుతాయి. అయితే ఇప్పుడు ఎన్నికయ్యే వారికి ద్వైవార్షిక ఎన్నికల సమయంలో టీడీపీ హైకమాండ్ మరో అవకాశం ఇచ్చే చాన్స్ ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ఎంపీలు అయ్యేవారు తరవాత కూడా మరో చాన్స్ దక్కించుకుంటారని పోటీ ఎక్కువగా ఉంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.