Allu Ayaan : మా అమ్మ జోలికి ఎవరైన వస్తే ఊరుకునేది లేదు.. అల్లు అర్జున్ కొడుకు మాములోడు కాదు..!
Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun మరి కొద్ది రోజులలో పుష్ప2 అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్న విషయం తెలిసిందే. పుష్పతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు పుష్ప2తో ఇంటర్నేషనల్ క్రేజ్ దక్కించుకోవాలని చూస్తున్నాడు. బన్నీకి ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు చిత్రాలతో స్టైలీష్ స్టార్‌గా యువతలో సెపరేట్ క్రేజ్ తెచ్చేలా చేసింది.. ప్రతి సినిమాకు ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ తన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు. నటన, డైలాగ్స్, ఫైట్స్‌తో పాటు ఈ జనరేషన్ తెలుగు హీరోల్లో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా మారారు.
Allu Ayaan : మా అమ్మ జోలికి ఎవరైన వస్తే ఊరుకునేది లేదు.. అల్లు అర్జున్ కొడుకు మాములోడు కాదు..!
ఎంతటి క్లిష్టమైన మూవ్‌మెంట్స్ అయినా సరే అలవోకగా చేస్తూ మావయ్య చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టారు. పరుగు, వరుడు, బద్రీనాథ్, రుద్రమదేవి వంటి విలక్షణ చిత్రాలలోనూ నటించి సత్తా చాటారు అల్లు అర్జున్. రేసుగుర్రం, సరైనోడు, అల వైకుంఠపురం చిత్రాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్ కెరీర్‌ను పుష్ప మలుపు తిప్పింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు పుష్ప2 ప్రమోషన్స్‌లో భాగంగా బన్నీ అన్‌స్టాపబుల్ షోకి వెళ్లాడు. ఈ షోలో బాలయ్య అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ ఆసక్తికరంగా ఆన్సర్ ఇచ్చారు. ఇదే షోకి బన్నీ కొడుకు అయాన్, కుమార్తె అర్హలు కూడా వచ్చి సందడి చేశారు. పిల్లలిద్దరూ బాలయ్య కాళ్లు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. నీకు తెలుగు వచ్చా అని అర్హని అడగ్గా .. అటజని కాంచె అంటూ తెలుగు పద్యాన్ని అలవోకగా చెబుతుంది.
అల్లు అయాన్‌తో కుస్తి పట్టి ఆటపట్టిస్తాడు బాలకృష్ణ. అయాన్‌కి వాళ్ల అమ్మ అంటే చాలా ఇష్టమని బన్నీ చెబుతాడు. యానిమల్ సినిమాలో వాళ్ల నాన్నని ఏమైనా అంటే హీరో చంపేసినట్లే .. మా ఇంట్లో రివర్స్ అని చెబుతాడు. నాన్న అంటే ఇష్టమే కానీ వాళ్ల అమ్మని ఏమైనా అంటే నాన్నని కూడా కొట్టేస్తాడని అయాన్ గురించి చెబుతాడు బన్నీ. పెళ్లికి ముందు ఎవరితో డేటింగ్ చేశావంటూ ఈ షోలో అల్లు అర్జున్ ను బాలయ్య అడిగాడు. దీనికి బన్నీ స్పందిస్తూ.. “ఈ షోని నా పిల్లలు కూడా చూస్తారు. మీ అమ్మను మాత్రమే ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకున్నాను అని నేను నా కొడుకుకు చెప్పాను.పెళ్లికి ముందే తన గురించి స్నేహా రెడ్డికి అన్ని విషయాలు చెప్పినట్లు కూడా ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలిపాడు. “ఆమెతో నేను ఏ విషయాన్ని దాచిపెట్టలేదు. గతంలో జరిగిన అన్ని విషయాలకూ పెళ్లి అనేది ఓ రీసెట్ బటన్ లాంటిది. అందువల్ల ఆమెకు అన్నీ తెలుసు” అని తాను డేట్ చేసిన అమ్మాయిల పేర్లు చెప్పకుండా బన్నీ జోక్ చేశాడు.
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
This website uses cookies.