Categories: andhra pradeshNews

Pawan Kalyan : చిన్మ‌య్ కృష్ణ దాస్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

Pawan Kalyan : మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుపుతున్న అకృత్యాలను అరికట్టాలని కోరిన మత గురువు, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే అధికార ప్రతినిధి చిన్మ‌య్ కృష్ణ దాస్‌ను ఇటీవల బంగ్లాదేశ్‌లో నిర్బంధించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదిక‌గా ఆయ‌న స్పందిస్తూ.. బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తమను తీవ్రంగా కలచివేసిందన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం తమ రక్తాన్ని చిందించిందని చెప్పారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి, భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Pawan Kalyan : చిన్మ‌య్ కృష్ణ దాస్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్..!

ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి చిన్మ‌య్ కృష్ణ దాస్‌ని బంగ్లాదేశ్ పోలీసులు నిర్బంధించడాన్ని ఖండిస్తూ అందరం కలిసికట్టుగా ఉందామ‌న్నారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తాము కోరుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం, చిన్మ‌య్ కృష్ణదాస్ బ్రహ్మచారిని మంగళవారం ఉదయం 11 గంటలకు చిట్టగాంగ్ ఆరవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కాజీ షరీఫుల్ ఇస్లాం ముందు హాజరు ప‌రిచారు. బెయిల్ పిటిషన్ ను తిర‌స్క‌రించిన న్యాయ‌స్థానం అతడిని జైలుకు పంపాలని ఆదేశించింది. చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశద్రోహ నేరం కింద కేసు నమోదైంది.

ఇదిలా ఉండగా మంగళవారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టుపై స్పందిస్తూ హిందువుల భద్రతను నిర్ధారించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. కాగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో మతపరమైన అనుబంధంతో సంబంధం లేకుండా దేశంలో ‘మత సామరస్యాన్ని’ నిలబెట్టడానికి ప్రభుత్వం దృఢంగా ఉందని పేర్కొంది.  Pawan Kalyan condems detention of Chinmoy Krishna Das in Bangladesh , Andhra Deputy CM, Pawan Kalyan, Chinmoy Krishna Das, Bangladesh

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

3 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

5 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

7 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

8 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

11 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

13 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

1 day ago