Nara Brahmani : జగన్‌కి నారా బ్రాహ్మణి మాస్ వార్నింగ్.. గంజాయి మత్తులో ఆంధ్ర జనాలను చెడగొడుతున్నారు అంటూ ఫైర్
Nara Brahmani : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు గురించే చర్చ నడుస్తోంది. ఇది భారతదేశానికే చీకటి రోజు అని ఒక విజనరీ లీడర్ ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై నారా బ్రాహ్మణి స్పందించారు. నారా భువనేశ్వరితో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇది అన్యాయం అన్నారు. తాను ఒక కుటుంబ సభ్యురాలిగానే కాకుండా ఒక యువతగా బాధపడుతున్నానన్నారు. యువతీయువకులకు స్కిల్స్ ఎలా వస్తాయి. జాబ్స్ ఎలా వస్తాయి. నారా చంద్రబాబు గారు ఏం చేశారు. ఆయన చేసింది అభివృద్ధి. లక్షలాది మంది యువతీయువకులకు జాబ్స్ వచ్చేలా చేయడం తప్పా? అంటూ నారా బ్రాహ్మణి ప్రశ్నించారు.
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? యువతీయువకులకు జాబ్స్ లేవు. బాధ పడుతున్నారు. ఇప్పుడు ఉన్న యువతకు గంజాయి ఇచ్చి, లిక్కర్ ఇచ్చి వాళ్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. నారా చంద్రబాబు గారు ఇక్కడ రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు గారి గొప్పదనం. అన్ని స్థాయిల వాళ్లు ముందుకొచ్చి మరీ మద్దతు ప్రకటిస్తున్నారు. మహిళలు కూడా చాలామంది బయటికి వచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆయన తెలుగు రాష్ట్రాలకు ఎంత అభివృద్ధి చేసి ఉంటారో మీరు ఆలోచించవచ్చు.ఐటీ ఉద్యోగులు కూడా బయటికి వచ్చి చంద్రబాబుకు మద్దతు పలికారు. చంద్రబాబు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. మన దేశంలో న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం తెలుపుకుంటూ నారా చంద్రబాబు గారు త్వరలోనే చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా బయటికి వచ్చి ఆంధ్రా రాష్ట్రాన్ని ఇంకోస్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నానని నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు.
Nara Brahmani : ఐటీ ఉద్యోగులకు కూడా ధన్యవాదాలు
మేము ఒంటిరి వాళ్లం కాదు.. మాతో పాటే నందమూరి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. మేము అందరి సపోర్ట్ తో త్వరలోనే చంద్రబాబు బయటికి వస్తారు. మా అత్త గారు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాలేదు. ఆమె తొలిసారి బయటికి వచ్చారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రాజమండ్రిలోనే ఆమె ఉన్నారు. నేను విజయవాడ, రాజమండ్రిలోనే తిరుగుతున్నాను. లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు దేవాన్ష్ ఒంటిరి వాడు అయ్యాడు అంటూ నారా బ్రాహ్మణి భావోద్వేగానికి గురయ్యారు.