Roja VS Brahmani : ఏయ్ బ్రాహ్మణి.. నెక్స్ట్ నీ మొగుడే.. ఏయ్ రోజా ఒళ్లు దగ్గరపెట్టుకో

Advertisement

Roja VS Brahmani : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ నేతలే కాదు నందమూరి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు ఇప్పటి వరకు రాజకీయాలు అంటే తెలియని నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూడా బయటికి వచ్చి చంద్రబాబు అరెస్ట్ పై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు అయితే సంబురాలు చేసుకుంటున్నారు. మంత్రి రోజా అయితే ఇంకో అడుగు ముందుకు వేసి మరీ డ్యాన్సులు చేశారు. ఈ రోజు కోసం నేను 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
nara brahmani versus minister roja over chandrababu arrest
maata

తాజాగా రోజా ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో తెలుగు సత్తా ఏంటో చూపించారు ఏపీ ప్రజలు. 2024 ఎన్నికల్లో అయితే చంద్రబాబుకు ఈ సీట్లు కూడా రావు. డిపాజిట్లు కూడా రావు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పేరుతో దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అంటూ రోజా ఫైర్ అయింది.

Advertisement

Roja VS Brahmani : కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఆయన

కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఆయన. ఎలాంటి ఆధారం లేకుండా ఆయన్ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో అంత సీనియర్ అయిన ఆయనకే ఇలా ఉంటే.. సామాన్య వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ బ్రాహ్మణి సీరియస్ అయ్యారు. ఆయన చేసింది అభివృద్ధి. లక్షలాది మంది యువతీయువకులకు స్కిల్స్ అందించి జాబ్ అవకాశాలు కల్పించారు. అభివృద్ధి చేయడం నేరమా? ఇన్ని జాబ్స్ ఇవ్వడం నేరమా? ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. యువతీయువకులకు జాబ్స్ లేవు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్లకు గంజాయి ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ల భవిష్యత్తును పాడు చేస్తున్నారు. చంద్రబాబు గారి యాత్రకు, లోకేష్ గారి పాదయాత్రకు చాలా రెస్పాన్స్ వస్తోంది. ఎలాంటి సాక్ష్యం లేకుండా వీళ్లు అనవసరంగా రచ్చ చేస్తున్నారు. మేము ఫైటర్స్, మేము తప్పకుండా పోరాడుతాం. న్యాయ వ్యవస్థ మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. వచ్చే వారంలోనే ఆయన నిర్దోషిగా బయటికి వస్తారనే నమ్మకం ఉంది అంటూ బ్రాహ్మణి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement