Ys Jagan : జగన్ కి తలనొప్పిగా మారిన నెల్లూరు జిల్లా రాజకీయాలు..!!
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ పార్టీకి కంచుకోట నెల్లూరు జిల్లా అని అందరికీ తెలుసు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడిన నాటినుండి 2019 వరకు జరిగిన అన్ని ఎన్నికలలో వైసీపీ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ జిల్లాలో రాజకీయ పరిణామాలు అధినేత వైయస్ జగన్ కి పెద్ద తలనొప్పిగా మారినట్లు ఏపీ రాజకీయాలలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ జిల్లాలో వైసీపీ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు దూరం కావటం జరిగింది. జిల్లా వైసీపీ నేతలలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరి కింద ఒకరు గోతులు తవ్వుకుంటున్నారు. మాజీ మంత్రి అనిల్ ది కూడా ఇదే పరిస్థితి అని సమాచారం.
మేటర్ లోకి వెళ్తే వచ్చే ఎన్నికలలో అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వకూడదని పార్టీ హై కమాండ్ పై జిల్లా వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఇక ఇదే సమయంలో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి వైసీపీ నాయకులు ఎవరూ కూడా ముందుకు రావడం లేదట. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా 2019లో గెలిచిన కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే టీడీపీ గూటికి చేరుకోవడం జరిగింది. ఆయనను నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా కూడా చంద్రబాబు నియమించారు. ఇదే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా వైసీపీ నియమించడం జరిగింది. అయితే నెల్లూరు పార్లమెంటు పోటీకి ఏ నాయకుడు ముందుకు రాని పరిస్థితి నెలకొనడంతో పాటు చాలామంది వైసిపి పార్టీని వీడుతూ ఉండటంతో జగన్ కి నెల్లూరు రాజకీయాలు తలనొప్పిగా మారినట్లు టాక్.
ఈ క్రమంలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెరపైకి తీసుకొస్తే తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని మీ నిర్ణయం అయితే వచ్చే ఎన్నికలలో అనిల్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వకూడదని జగన్ కి షరతు పెట్టారట. వచ్చే ఎన్నికల్లో అతడు పోటీ చేస్తే కచ్చితంగా ఓటమి తప్పదని కూడా చెప్పారట. ఈ పరిణామాలతో నెల్లూరులో జరుగుతున్న రాజకీయంపై జగన్ తీవ్ర అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.