Home » Andhra Pradesh » No Ticket To Alla Ramakrishna Reddy From Mangalagiri
andhra pradesh

Alla Ramakrishna Reddy : మంగళగిరి నుంచి నో టికెట్.. ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలో ఉంచకపోవడానికి కారణం అదేనా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: August 26, 2023, 11:00 am
Advertisement

Alla Ramakrishna Reddy : ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు 2019 ఎన్నికల సమయంలో మారుమోగిపోయింది. దానికి కారణం.. టీడీపీ యువనేత నారా లోకేష్ ఈయన పోటీగా టీడీపీ నుంచి పోటీ చేయడం. ఎలాగైనా నారా లోకేష్ గెలుపు కోసం మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు తెగ ప్రయత్నాలు చేశారు కానీ.. ఆళ్లను ఓడించలేకపోయారు. కానీ.. ఆళ్ల గెలిచింది కూడా బోటాబోటి మెజారిటీతో. అంత భారీ మెజారిటీ కూడా కాదు. కానీ.. నారా లోకేష్ ను అయితే ఓడించాడు కదా.

Advertisement

నిజానికి 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో అయితే జస్ట్ లో ఎమ్మెల్యే అయ్యాడు. 12 ఓట్ల తేడాతోనే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇక.. 2019 ఎనికల్లో కూడా నారా లోకేష్ తో పోటీ పడి కేవలం 5000 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. అందుకే ఆయన గెలుపేమీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. ఇవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. వైసీపీ చేయించిన సర్వే నివేదికలో పలు కీలక నిజాలు బయటపడ్డాయట. అక్కడ యాంటీ ఇంకెబెన్సీ ఎక్కువగా ఉందట.ఒకవేళ ఆళ్లను పోటీ చేయనీయకుండా పక్కన పెట్టేస్తారా? అనేది స్పష్టంగా తెలియదు. కానీ.. ఆయన్ను బరిలోకి దింపకుండా ఖాళీగా మాత్రం ఉంచకూడదని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం.. అమరావతి రాజధాని భూకుంభకోణాలను అప్పట్లో ఆయన వెలికితీశారు. దాని వల్ల టీడీపీకి చాలా సమస్యలు వచ్చాయి. అలాగే.. జగన్ కి కూడా ఆయన ఆప్తమిత్రులు.

no ticket to alla ramakrishna reddy from mangalagiri

Advertisement

Alla Ramakrishna Reddy : ఆళ్లను పోటీ చేయనీయకుండా పక్కన పెట్టేస్తారా?

అందుకే.. ఆళ్లను మంగళగిరి టికెట్ ఇవ్వకున్నా.. బాపట్ల టికెట్ ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట. ఎలాగూ బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి మీద ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే.. ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆళ్లను బాపట్ల బరిలో దించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి