SHG : డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000
ప్రధానాంశాలు:
SHG : డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000
SHG : ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కానుకను అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యుల పిల్లల చదువులు, వివాహ అవసరాలకు ప్రభుత్వం నామమాత్ర వడ్డీకే రుణం అందించనుంది.. 5 శాతం వడ్డీతోనే రూ.లక్ష వరకు రుణాన్ని అందివ్వనుంది. ఇప్పటికే సీఎంఓ నుంచి సమ్మతి రావడంతో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.

SHG : డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000
రూ.4 వేల కోట్ల రుణాలిచ్చేలా ప్రణాళికలు
ఈ పథకాన్ని సెర్ప్ పరిధిలోని స్త్రీనిధి సంస్థ ద్వారా అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. పథకానికి ప్రభుత్వం ప్రతి ఏటా రూ.1,000 కోట్లు కేటాయించనుంది. వచ్చే నాలుగేళ్లలో రూ.4 వేల కోట్ల రుణాలిచ్చేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు.
అదనపు పని దినాలు కల్పించాలి
రాష్ట్రంలో వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పని పూర్తి చేసుకున్న కుటుంబాలకు అదనంగా పని దినాలు కల్పించాలనే డిమాండ్ వినిపిస్తంది. ఈ మేరకు ఏపీ వ్యవసాయ, కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌కు లేఖ రాశారు. అలాగే యంత్రాల వినియోగం, కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని కోరారు.