Chandrababu : ఎన్టీయేతోనే మా పయనం.. ప్రజాసేవకులగా పని చేస్తాం.. చంద్రబాబు..!
ప్రధానాంశాలు:
Chandrababu : ఎన్టీయేతోనే మా పయనం.. ప్రజాసేవకులగా పని చేస్తాం.. చంద్రబాబు..!
Chandrababu : Andhra pradesh ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూటమికి భారీ విజయాన్ని అందించడంపై ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని TDP టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన Press Meet మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రజలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో చూడలేదని చెప్పారు. అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నదే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని.. దేశం, ప్రజాస్వామ్యమే శాశ్వతం అన్నారు. పార్టీలు సరిగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని తెలిపారు. ఇలాంటి ఎన్నికలు తాను ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో విదేశాల్లో ఉన్నవారు సైతం వచ్చి ఓట్లు వేశారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నికలు ఇవి అన్నారు. జగన్ ప్రభుత్వం విచ్చలవిడి అవినీతికి, అరాచకాలకు పాల్పడడం వలనే ఆ పార్టీకి ఈ గతి పట్టిందని ఆరోపించారు. Ys Jagan జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులను, కార్యకర్తలను హింసించిందని, వారికి కంటి నిండా కునుకులేకుండా చేశారని అన్నారు.
జై తెలుగు దేశం అంటే ప్రాణాలు తీశారని, జై జగన్ అనాలని హింసించారని ఆరోపించారు. మీడియా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునేలా జగన్ పాలన సాగిందని ధ్వజమెత్తారు. తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పవన్ చెప్పేవారని గుర్తు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏలో భాగస్వాములుగా బాధ్యతతో ముందుకెళ్తామని ప్రకటించారు.