pawan kalyan : జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్..!
pawan kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. ఆ తర్వాత పరిస్థితులు చాలా మారాయి. అయితే ఎక్కువగా దాడులు చేసుకోవడం మనం చూస్తున్నాం. ఆ పార్టీ వారు మా వాళ్లని కొడుతున్నారని కొందరు అంటుంటే మరి కొందరు వీరిపై కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా పోలవరం పార్టీ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్‌పై దాడి కలకలంరేపింది. ఆయన కారుపై గుర్తుతెలియని వ్యక్తు లు రాళ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే బాలరాజు బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయలుదేరారు.. ఇంతలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఈ దాడి జరిగింది. ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు..
pawan kalyan పవన్ సీరియస్..
కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని.. తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి.. దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటనపై పోలీసు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దాడి ఘటన స్థానికంగా కలకలంరేపింది. కారు అద్దాల పగిలిన ప్రదేశంలో అంతగా అనుమానించాల్సిన పరిస్థితులు లేవని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసు అధికారులు సన్నద్ధం అయ్యారు.
ఘటన జరిగిన ప్రదేశంలో వసతిగృహం ఉందని తెలిపారు. ఆకతాయిలు విసిరిందా, ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా విసిరారా అన్నది పోలీస్ లు విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని పోలవరం డిఎస్పీ తెలిపారు.పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ళ దాడిని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి సమయంలో ఎమ్మెల్యే అనుచరులు ముగ్గురు కిందకు దిగి దాడికి పాల్పడ్డ వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే, వారు అక్కడి నుంచి పరారయ్యారు. చీకటి పడటంతో దాడికి పాల్పడ్డ వారిని గుర్తించలేకపోయామని ఎమ్మెల్యే అనుచరులు తెలిపారు