Pawan kalyan : గత కొద్ది రోజులుగా ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం ఎంత ప్రకంపనలు పుట్టిస్తుందో మనం చూశాం.ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి సనాతన ధర్మం అంటూ నానా హంగామా చేశారు.అన్ని మతాలను గౌరవిద్దాం హిందూత్వ ధర్మానికి వస్తున్న ముప్పును తరిమికొడదాం అన్న సింగిల్ పాయింట్ ఎజెండా ద్వారా పవన్ కల్యాణ్ సనాతన ధర్మ రాజకీయాలకు తిరుపతి వేదికగా శ్రీకారం చుట్టారు. ఆయన కేవలం ఏపీకి..లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు. తమిళనాడుపైనా ఉత్తరాదిపైనా ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ గతంలో ఇంత తీవ్రంగా హిందూత్వ, సనాతన ధర్మంపై మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రమే పూర్తి స్థాయి కాషాయ వాదనను వినిపించారు.
బీజేపీ వ్యూహంలో భాగంగానే పవన్ ఇలా చేస్తున్నారని అందుకే ఎక్కువ మంది నమ్ముతున్నారు. తమిళనాడలో డీఎంకే వారసుడిగా తెరపైకి వచ్చిన ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం ఓ వైరస్ వంటిదని దాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలను పవన్ ప్రస్తావించారు. ఇతర మతాల గురించి ఎందుకు అలా మాట్లాడరని పవన్ సూటి ప్రశ్న. దానికి సమాధానం కోసమే పోరాడాలని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో జూనియర్ స్టాలిన్ మాత్రం సంయమనం పాటించారు. పవన్ వ్యాఖ్యలపై ప్రశ్నించినా లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ తప్పించుకున్నారు. తద్వారా పవన్ కు తనను టార్గెట్ చేసేందుకు మరో అవకాశం ఇవ్వలేదు.
హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన .. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. గతంలో తనది కమ్యూనిస్టు భావజాలమని పవన్ చెబుతూ ఉండేవారు. కమ్యూనిస్టు భావజాలానికి.. సనాతన ధర్మ రాజకీయానికి అసలు పొసగదు. మరి పవన్ అలాంటి ఎందుకు మారిపోయారంటే.. భారతీయ జనతా పార్టీ దక్షిణాది వ్యూహాన్ని పవన్ ద్వారా అమల చేస్తోందని అనుకోవచ్చు. పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషీ కాదని చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని సులువుగా అర్ధం అవుతుంది.గతంలో లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో ఎలాగైనా బోణీ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ.. పొరుగున ఉన్న ఏపీలో ఎంతో బిజీగా ఉన్న నారా లోకేష్ ను అక్కడి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని కోయంబత్తూరులో గెలిపించేందుకు రంగంలోకి దింపిన ప్రయోజనం లేదు. దీంతో లోకేష్ కంటే పవన్ ను రంగంలోకి దించడం ద్వారా తమిళనాడులో వచ్చే జమిలి ఎన్నికల కల్లా ఉనికి చాటుకోవాలని బీజేపి సరికొత్త ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.