Pawan kalyan : బీజేపీ స‌రికొత్త స్కెచ్.. లోకేష్ ఫెయిల్ అయిన చోట ప‌వ‌న్‌ని రంగంలోకి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan kalyan : బీజేపీ స‌రికొత్త స్కెచ్.. లోకేష్ ఫెయిల్ అయిన చోట ప‌వ‌న్‌ని రంగంలోకి..!

Pawan kalyan : గ‌త కొద్ది రోజులుగా ఏపీలో తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం ఎంత ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుందో మ‌నం చూశాం.ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి స‌నాత‌న ధ‌ర్మం అంటూ నానా హంగామా చేశారు.అన్ని మతాలను గౌరవిద్దాం హిందూత్వ ధర్మానికి వస్తున్న ముప్పును తరిమికొడదాం అన్న సింగిల్ పాయింట్ ఎజెండా ద్వారా పవన్ కల్యాణ్ సనాతన ధర్మ రాజకీయాలకు తిరుపతి వేదికగా శ్రీకారం చుట్టారు. ఆయన కేవలం ఏపీకి..లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan kalyan : బీజేపీ స‌రికొత్త స్కెచ్.. లోకేష్ ఫెయిల్ అయిన చోట ప‌వ‌న్‌ని రంగంలోకి..!

Pawan kalyan : గ‌త కొద్ది రోజులుగా ఏపీలో తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం ఎంత ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుందో మ‌నం చూశాం.ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి స‌నాత‌న ధ‌ర్మం అంటూ నానా హంగామా చేశారు.అన్ని మతాలను గౌరవిద్దాం హిందూత్వ ధర్మానికి వస్తున్న ముప్పును తరిమికొడదాం అన్న సింగిల్ పాయింట్ ఎజెండా ద్వారా పవన్ కల్యాణ్ సనాతన ధర్మ రాజకీయాలకు తిరుపతి వేదికగా శ్రీకారం చుట్టారు. ఆయన కేవలం ఏపీకి..లేకపోతే తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు. తమిళనాడుపైనా ఉత్తరాదిపైనా ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ గతంలో ఇంత తీవ్రంగా హిందూత్వ, సనాతన ధర్మంపై మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రమే పూర్తి స్థాయి కాషాయ వాదనను వినిపించారు.

Pawan kalyan బీజేపీ కొత్త వ్యూహం..

బీజేపీ వ్యూహంలో భాగంగానే పవన్ ఇలా చేస్తున్నారని అందుకే ఎక్కువ మంది నమ్ముతున్నారు. త‌మిళ‌నాడ‌లో డీఎంకే వారసుడిగా తెరపైకి వచ్చిన ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం ఓ వైరస్ వంటిదని దాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలను పవన్ ప్రస్తావించారు. ఇతర మతాల గురించి ఎందుకు అలా మాట్లాడరని పవన్ సూటి ప్రశ్న. దానికి సమాధానం కోసమే పోరాడాలని ఆయన చెబుతున్నారు. ఈ విష‌యంలో జూనియర్ స్టాలిన్ మాత్రం సంయమనం పాటించారు. పవన్ వ్యాఖ్యలపై ప్రశ్నించినా లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ తప్పించుకున్నారు. తద్వారా పవన్ కు తనను టార్గెట్ చేసేందుకు మరో అవకాశం ఇవ్వలేదు.

Pawan kalyan బీజేపీ స‌రికొత్త స్కెచ్ లోకేష్ ఫెయిల్ అయిన చోట ప‌వ‌న్‌ని రంగంలోకి

Pawan kalyan : బీజేపీ స‌రికొత్త స్కెచ్.. లోకేష్ ఫెయిల్ అయిన చోట ప‌వ‌న్‌ని రంగంలోకి..!

హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన .. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. గతంలో తనది కమ్యూనిస్టు భావజాలమని పవన్ చెబుతూ ఉండేవారు. కమ్యూనిస్టు భావజాలానికి.. సనాతన ధర్మ రాజకీయానికి అసలు పొసగదు. మరి పవన్ అలాంటి ఎందుకు మారిపోయారంటే.. భారతీయ జనతా పార్టీ దక్షిణాది వ్యూహాన్ని పవన్ ద్వారా అమల చేస్తోందని అనుకోవచ్చు. పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషీ కాదని చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని సులువుగా అర్ధం అవుతుంది.గతంలో లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో ఎలాగైనా బోణీ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ.. పొరుగున ఉన్న ఏపీలో ఎంతో బిజీగా ఉన్న నారా లోకేష్ ను అక్కడి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని కోయంబత్తూరులో గెలిపించేందుకు రంగంలోకి దింపిన ప్ర‌యోజ‌నం లేదు. దీంతో లోకేష్ కంటే పవన్ ను రంగంలోకి దించడం ద్వారా తమిళనాడులో వచ్చే జమిలి ఎన్నికల కల్లా ఉనికి చాటుకోవాలని బీజేపి స‌రికొత్త ప్ర‌యత్నాలు చేస్తుంద‌ని అంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది