Pawan Kalyan : భీమవరం వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు.. వీడియో
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయయాత్ర ఏపీ రాజకీయాలల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగో విడతలలో నాలుగు జిల్లాలలో పవన్ కళ్యాణ్ యాత్ర చేయడం జరిగింది. అయితే ఈ యాత్రలన్నిటిలో 2019 ఎన్నికలలో భీమవరం నుండి పోటీ చేసి ఓడిపోయిన ప్రాంతంలో అదే చోట నిర్వహించిన వారహీయాత్ర చాలా హైలెట్ అయింది. భీమవరంలో పవన్ కళ్యాణ్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే భీమవరం నుండి పోటీ […]
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయయాత్ర ఏపీ రాజకీయాలల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాలుగో విడతలలో నాలుగు జిల్లాలలో పవన్ కళ్యాణ్ యాత్ర చేయడం జరిగింది. అయితే ఈ యాత్రలన్నిటిలో 2019 ఎన్నికలలో భీమవరం నుండి పోటీ చేసి ఓడిపోయిన ప్రాంతంలో అదే చోట నిర్వహించిన వారహీయాత్ర చాలా హైలెట్ అయింది. భీమవరంలో పవన్ కళ్యాణ్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
అయితే భీమవరం నుండి పోటీ చేసి తాను ఓటమి చెందటం ఎంతో బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. అయినా గాని భీమవరం ప్రజలు అద్భుతమైన స్వాగతం పలికారు అని స్పీచ్ ఇచ్చారు. భీమవరం లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ అన్నిటిలోకల్లా హైలెట్ అయింది. ఈ క్రమంలో హైదరాబాదులో వైసీపీ నాయకులు చేసే ప్రతిదీ తనకు తెలుసని ఈ సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైసీపీ నాయకుల వ్యక్తిగత విషయాలు బయట పెడితే చెవుల్లో నుండి రక్తం వస్తుందని అన్నారు.
ముఖ్యంగా సీఎం జగన్ పర్సనల్ జీవితం క్షణం క్షణం మొత్తం డీటెయిల్ గా తెలుసు అని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్లు నాపై వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాటిపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసేవారు, పాలసీ పై మాట్లాడకుండా.. వ్యవహరించేవారు తనకు చాలా చిరాకు అని పవన్ భీమవరం సభలో సీరియస్ కామెంట్స్ చేశారు.