Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన తనదైన శైలిలో ప్రభుత్వ కార్యకలాపాలని ముందుకు తీసుకెళుతున్నాడు. “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలషను తాజాగా పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో లాంచనంగా ప్రారంభించారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ వందరోజుల పని దినాలు, 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాల నిర్మాణం, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు తవ్వకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
‘ప్రతీ పంచాయతీలో ఏం పనులు జరుగుతున్నాయి అనేది ప్రజలకు తెలియాలి అని.. ప్రతీ పంచాయతీ కార్యాలయంలో సిటిజన్ నాలెడ్జ్ బోర్డ్ ఏర్పాటు చేసి వివరాలు తెలియపరుస్తున్నాం. సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి నిధులు వస్తాయి. దీని ద్వారా నైపుణ్యం లేని వ్యక్తులకు ఉపాధి అందించే లక్ష్యంగా పనిచేస్తుంది. పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి 15 రోజుల్లో ప్రభుత్వం పని కల్పించడం ప్రభుత్వ భాధ్యత. గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, వారి జీవితాలు మెరుగుపరిచేలా కృషి చేస్తాం’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతి అధికారులు తమకు వద్దు లంచం పేరుతో ఎవరు ఇబ్బంది పెట్టినా తమ దృష్టికి తీసుకురావాలని పవన్ స్పష్టం చేశారు. తాము ప్రజలకు సేవ చేయడానికే వచ్చామని, అభివృద్ధి చేస్తామని తెలిపారు.
పరిపాలన ఎలా చేయాలనే అంశంలో తనకు నారా చంద్రబాబునాయుడు స్పూర్తి అని అన్నారు. కేబినెట్ సమావేశాల్లో చంద్రబాబు చాలా బలంగా మాట్లాడతారని, అధికారులు లేవనెత్తే సందేహాలకు కూడా చంద్రబాబు చెప్పే సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తాయన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 30వేల పనులు చేయాలంటే ఎన్నో శాఖల సహకారం, సమన్వయం తప్పని సరి అని అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు చిత్తశుద్ది ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. పది శాఖలు అధికారులు కలిసి సమన్వయంతో పని చేసి లక్ష్యాలను చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ.4500 కోట్ల వ్యయంతో 30 వేలకు పైగా పనులు చేపట్టి, దాదాపు 8 లక్షల మందికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నాము అని వెల్లడించారు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.