
Allu Arjun : తుస్సుమనిపించిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఆశలన్నీ కూడా అల్లు అర్జున్‌పైనే..!
Allu Arjun : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా పక్కా ఉంటారు. వారు తమ నటనతోనే కాదు డ్యాన్స్‌లతోను అదరగొడుతున్నారు. అయితే వీరి ముగ్గురిలో ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రత్యేకం అని చెప్పాలి. కాకపోతే దేవరలో ఎన్టీఆర్ డ్యాన్స్ అంతగా లేదనే టాక్ వినిపిస్తుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ‘దావుడి’ పాటలో స్టెప్పులు రొటీన్‌గా అనిపించాయి. ఫాస్ట్ బీట్ కు తగ్గట్టుగా తారక్ తన డ్యాన్స్ మూమెంట్స్ తో ప్రత్యేకతని చాటుకున్న కూడా జనాలకి అందులో కొత్తదనం ఏమి కనిపించలేదు. ఇక సూపర్ హిట్ అయిన ‘చుట్టమల్లె’ పాటలో ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ కెమిస్ట్రీ, పిక్చరైజేషన్ ఆకట్టుకున్నాయి. కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కంపోజ్ చేసిన సింపుల్ స్టెప్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ఇక ‘ఆయుధ పూజ’ సాంగ్‌లో ఎన్టీఆర్ డ్యాన్స్‌కు ప్రశంసలు దక్కాయి. గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులు చాలా స్పెషల్ గా ఉన్నాయి. అదే సమయంలో గణేష్ ఆచార్య ‘రా మచ్చా’ పాటకు కంపోజ్ చేసిన స్టెప్పులు తేలిపోయాయి. విజువల్స్ అందంగా ఉన్నా కూడా కొరియోగ్రఫీ ఏమాత్రం బాగోలేదు. ఇక మరో హీరో రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.ఈ చిత్రం నుండి వచ్చిన ‘జరగండి’ సాంగ్ డ్యాన్సులకు కూడా మిశ్రమ స్పందన వచ్చింది. శంకర్ మార్క్ గ్రాండియర్ కనిపించినప్పటికీ, ప్రభుదేవా మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఏమంత స్పెషల్‌గా లేవు. దీంతో చరణ్ తన డ్యాన్స్‌ల విషయంలో నిరుత్సాహపరిచాడని అంటున్నారు.
Allu Arjun : తుస్సుమనిపించిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఆశలన్నీ కూడా అల్లు అర్జున్‌పైనే..!
ఇక అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప 2. ఈ సినిమాలో ‘పుష్ప పుష్పరాజ్’ పాట కొరియోగ్రఫీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘పుష్ప: ది రూల్’ చిత్రంలోని ‘సూసేకి’ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేయబడిన లిరికల్ సాంగ్ వీడియోని స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ – రష్మిక మందన్నలతో ఎలాంటి డ్యాన్సులు వేయించాడో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప మొదటి పార్ట్‌లో గణేష్ ఆచార్య తన కొరియోగ్రఫీతో ఆకట్టుకోగా, ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో కూడా దుమ్మ రేపుతాడని అంటున్నారు. చూడాలి మరి ఎన్టీఆర్, రామ్ చరణ్ మాదిరిగా కాకుండా తనదైన స్టైల్‌లో బన్నీ దుమ్ము రేపుతాడా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.