Pawan Kalyan : ఉపాధి హామీ కూలీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నేను ఎవ‌రితో పోటీ ప‌డ‌నంటూ కామెంట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ఉపాధి హామీ కూలీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నేను ఎవ‌రితో పోటీ ప‌డ‌నంటూ కామెంట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 October 2024,3:20 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : ఉపాధి హామీ కూలీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నేను ఎవ‌రితో పోటీ ప‌డ‌నంటూ కామెంట్..!

Pawan Kalyan : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న త‌న‌దైన శైలిలో ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ని ముందుకు తీసుకెళుతున్నాడు. “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలష‌ను తాజాగా పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో లాంచనంగా ప్రారంభించారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ వందరోజుల పని దినాలు, 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాల నిర్మాణం, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు తవ్వకం పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఉపముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

Pawan Kalyan పంచాయ‌తీ వారోత్స‌వాలు..

‘ప్రతీ పంచాయతీలో ఏం పనులు జరుగుతున్నాయి అనేది ప్రజలకు తెలియాలి అని.. ప్రతీ పంచాయతీ కార్యాలయంలో సిటిజన్ నాలెడ్జ్ బోర్డ్ ఏర్పాటు చేసి వివరాలు తెలియపరుస్తున్నాం. సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి నిధులు వస్తాయి. దీని ద్వారా నైపుణ్యం లేని వ్యక్తులకు ఉపాధి అందించే లక్ష్యంగా పనిచేస్తుంది. పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి 15 రోజుల్లో ప్రభుత్వం పని కల్పించడం ప్రభుత్వ భాధ్యత. గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, వారి జీవితాలు మెరుగుపరిచేలా కృషి చేస్తాం’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతి అధికారులు తమకు వద్దు లంచం పేరుతో ఎవరు ఇబ్బంది పెట్టినా తమ దృష్టికి తీసుకురావాలని పవన్ స్పష్టం చేశారు. తాము ప్రజలకు సేవ చేయడానికే వచ్చామని, అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Pawan Kalyan ఉపాధి హామీ కూలీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నేను ఎవ‌రితో పోటీ ప‌డ‌నంటూ కామెంట్

Pawan Kalyan : ఉపాధి హామీ కూలీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నేను ఎవ‌రితో పోటీ ప‌డ‌నంటూ కామెంట్..!

పరిపాలన ఎలా చేయాలనే అంశంలో తనకు నారా చంద్రబాబునాయుడు స్పూర్తి అని అన్నారు. కేబినెట్ సమావేశాల్లో చంద్రబాబు చాలా బలంగా మాట్లాడతారని, అధికారులు లేవనెత్తే సందేహాలకు కూడా చంద్రబాబు చెప్పే సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తాయన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 30వేల పనులు చేయాలంటే ఎన్నో శాఖల సహకారం, సమన్వయం తప్పని సరి అని అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు చిత్తశుద్ది ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. పది శాఖలు అధికారులు కలిసి సమన్వయంతో పని చేసి లక్ష్యాలను చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ.4500 కోట్ల వ్యయంతో 30 వేలకు పైగా పనులు చేపట్టి, దాదాపు 8 లక్షల మందికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నాము అని వెల్లడించారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది