Botsa Satyanarayana : బొత్సకి పవన్ కళ్యాణ్ అలాంటి సాయం చేశారా.. ఆశ్చర్యంలో జనసైనికులు
ప్రధానాంశాలు:
Botsa Satyanarayana : బొత్సకి పవన్ కళ్యాణ్ అలాంటి సాయం చేశారా.. ఆశ్చర్యంలో జనసైనికులు
Botsa Satyanarayana : పవన్ కళ్యాణ్, వైసీపీ నాయకుల మధ్య వైరం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అయితే బొత్స మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కాస్త ఆచితూచి మాట్లాడేవాడు. బొత్సకు, పవన్‌కి మంచి పరిచయాలు సినీ రంగంలో హీరోగా ఉన్నపుడే ఉన్నాయని అంటున్నారు. మరో వైపు ఇద్దరూ ఒక్కటే కులస్తులు. దాంతోనే పవన్ కూడా బొత్సకు అదే క్యాస్ట్ ఈక్వేషన్స్ తోనే మద్దతుగా నిలిచి హెల్ప్ చేశారు అని నెట్టింట ప్రచారం నడుస్తుంది.విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంటున్నట్లు తెలిసింది. అందువల్ల వైసీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమే అనుకోవచ్చు.
Botsa Satyanarayana పవన్ సాయం..
చెప్పాలంటే ఇది మొదటి నుంచి అందరూ ఊహించినదే. టీడీపీ కూటమికి సరైన బలం లేదు.. అందువల్ల ఆ పార్టీ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. అయినా సరే ఆ పార్టీ నామినేషన్ల చివరి రోజు వరకూ.. విషయం చెప్పకుండా నాన్చుతూ వచ్చింది. కానీ.. తాజాగా పోటీకి దూరంగా ఉండాలని డిసైడైనట్లు తెలిసింది. గెలుస్తాము అని తెలిసినా వైసీపీ.. ఈ ఉప ఎన్నికకు సాదా సీదా అభ్యర్థిని నిలబెట్టకుండా.. ఏకంగా అత్యంత సీనియర్ అయిన బొత్ససత్యనారాయణను నిలబెట్టింది. దాన్ని బట్టే ఈ ఎన్నికను ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుందనే సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో అటు టీడీపీ కూటమికి.. బొత్సను బలంగా ఎదుర్కొనే స్థాయి నేత లేని కొరత కనిపిస్తోంది అని కొందరు అంటున్నారు.
Botsa Satyanarayana : బొత్సకి పవన్ కళ్యాణ్ అలాంటి సాయం చేశారా.. ఆశ్చర్యంలో జనసైనికులు
మరోవైపు పవన్ పట్టుబట్టడం వల్లనే బొత్సకి వ్యతిరేఖంగా కూటమి నుండి ఎవరు నిలబడలేదని అంటున్నారు. బొత్సకు పవన్ ఈ విధంగా ఎందుకు ఫేవర్ చేశారు అన్నది కూడా చర్చగా ఉంది. అయితే పవన్ దీనిని రానున్న రోజులలో జనసేనకి తనకి అనుకూలంగా వాడుకోనున్నారని అంటున్నారు. జనసేన విస్తరణకు అలాగే ఉత్తరాంధ్రలో బొత్స లాంటి లీడర్ ని తమ వైపు తిప్పుకునేందుకే పవన్ ఈ రకంగా వ్యవహరించారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆ మధ్య బొత్స జనసేనలోకి వెళ్తారు అని టాక్ కూడా నడిచింది. ఆయన వైసీపీ ఓటమి తరువాత కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండడంతో ఆ వార్తలు ప్రచారం జరిగాయి. ఏది ఏమైన పవన్, బొత్స వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.