Pawan kalyan : మాట జారితే తాటతీస్తా .. ఇన్ డైరెక్ట్ గా నారా లోకేష్ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..
ప్రధానాంశాలు:
Pawan kalyan : మాట జారితే తాటతీస్తా .. ఇన్ డైరెక్ట్ గా నారా లోకేష్ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం
Pawan kalyan : ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే ఇరుపక్ష పార్టీలు పోటీకి సన్నద్ధం అవుతున్నాయి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ పార్టీపై గెలవాలని జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఇక బీజేపీ కూడా వీరితో కలిస్తే వైయస్సార్సీపి పార్టీకి ఓటమి ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీ, విశాఖపట్నం నాయకుడు చెన్నబోయిన వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలోకి చేరారు. మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ..
ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు యువరాజ్యం విభాగం తరపున వంశీకృష్ణ యాదవ్ తనతో కలిసి పనిచేశారని, కలిసి రాజకీయ ప్రయాణం చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి వంశీకృష్ణ తిరిగి జనసేనలోకి రావడం సొంత ఇంటికి రావడం లాంటిదే అని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే అన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తమ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేన పార్టీ లక్ష్యమని, ఉన్నతమైన దశలో రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రక్రియలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో తెలుసుకొని మళ్లీ తిరిగి వస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం అవుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.
వంశీకృష్ణ యాదవ్ మా పార్టీలోకి వస్తున్న సమయంలో వైసీపీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని, జనసేన భావజాలం నచ్చి పార్టీలోకి వస్తున్నానని చెప్పడం నన్ను ఆకట్టుకుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనను ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిగా చూడటం లేదు. ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 70,80 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించేవి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన కీలక పాత్ర పోషించాలి. జనసేన లోకి వచ్చిన వంశీకృష్ణ గారు జనసేన కోసం తనవంతు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇలాంటి చేరికలు జనసేన పార్టీలో ఇంకా ఉంటాయని వెల్లడించారు.