Chandrababu Naidu : ఇదేందో కొత్తగా ఉంది.. పేర్ని నాని చంద్రబాబుని పొగడడం ఏంటి..!
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : ఇదేందో కొత్తగా ఉంది.. పేర్ని నాని చంద్రబాబుని పొగడడం ఏంటి..!
Chandrababu Naidu : వైసీపీకి చెందిన పేర్ని నాని ఒకప్పుడు చంద్రబాబుపై నిప్పులు చెరగడం మనం చూశాం. కాని ఇప్పుడు చంద్రబాబు హుందాతనాన్ని ఆయన ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే మాజీ మంత్రి పేర్ని నాని తన భార్య జయసుధ పేరుతో ఉన్న గోదాములలో నిలువ ఉంచి బియ్యం మూటలు మాయం అయ్యాయని ‘లిఖిత పూర్వకంగా’ ప్రభుత్వానికి తెలియజేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ క్రమంలో పేర్ని నాని కూటమి ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తూనే, మరోపక్క సిఎం చంద్రబాబు నాయుడు చాలా హుందాగా వ్యవహరిస్తున్నారని పొగుడుతున్నారు. నా భార్య జయసుధని, కొడుకు కిట్టూని అరెస్ట్ చేయాలని నా రాజకీయ ప్రత్యర్ధి, మంత్రి కొల్లు రవీంద్ర చాలా తహతహలాడుతున్నాడు.
Chandrababu Naidu ఎందుకు ఈ ఆటలు..
కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, “ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళుతున్నావు?మన టార్గెట్ పేర్ని నానిగాడు కదా.. వాడిని లోపల వేసేయ్.. కావాలంటే వాడి కొడుకుని కూడా వేసేసుకుని నీ కక్ష తీర్చుకో కానీ ఆడాళ్ళ జోలికి వెళ్లొద్దు,” అని మంత్రి కొల్లుకి సిఎం చంద్రబాబు నాయుడుగారు మెత్తగా చీవాట్లు పెట్టారని పేర్ని నాని స్వయంగా చెప్పుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు.. అంటూ ఏకవచనంలో సంభోదించిన పేర్ని నాని ఇప్పుడు ‘చంద్రబాబు నాయుడుగారు’ అంటూ మర్యాద ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలలో ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తున్నారని పొగుడుతున్నారు కూడా. అయితే ఆయన మాటలని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడుని పొగుడుతూనే రాజకీయ కక్షలు తీర్చుకోమని తన పార్టీ నేతలను ప్రోత్సాహిస్తున్నారని పేర్ని నాని చెపుతున్నారన్న మాట.
రేషన్ దుకాణం నుంచి కేజీ బియ్యం దొంగతనం చేస్తే జనాలు పట్టుకొని చితకబాదుతారు. కానీ తన కుటుంబానికి చెందిన గోదాము నుంచి ఏకంగా రూ.1.70 కోట్లు విలువైన 37,88,660 కేజీల బియ్యం మాయం అయితే పట్టించుకోవద్దని పేర్ని నాని సూచిస్తున్నారు! కేసులు నమోదు చేస్తుంటే సిఎం చంద్రబాబు నాయుడు పేరుతో అధికారులను కట్టడి చేసేవిదంగా మాట్లాడుతూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. అధికారంలో లేకపోయినా పేర్ని నాని మంత్రులను, అధికారులను తన జోలికి రాకుండా చేసుకోగలుగుతున్నారు. అయితే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం ఈ విషయం వదిలేసి పేర్నికి సీఎంవోలో జరిగిన విషయం ఎలా లీకైందనే ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. సీఎంవోలో కోవర్టులు ఉన్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు.