Perni Nani : పేర్ని నాని .. కూటమి ప్రభుత్వాన్ని అంత‌ మాట అనేశాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Perni Nani : పేర్ని నాని .. కూటమి ప్రభుత్వాన్ని అంత‌ మాట అనేశాడు..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2025,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Perni Nani : పేర్ని నాని .. కూటమి ప్రభుత్వాన్ని అంత‌ మాట అనేశాడు..!

Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి పాలనలో “బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ” అన్న భావన నెలకొంది అని ఎద్దేవా చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులను బయటకు తరిమివేసినా ఆయన స్పందించలేదని ఆరోపించారు. దళితురాలైన హోంమంత్రి అనిత సైతం అక్కడికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకునే తత్వం చూపలేదన్నారు. వ్యాపారవేత్త వీరయ్య చౌదరి మృతికి హోంమంత్రి హుటాహుటిన అక్కడకు పరిగెత్తడం ఏమిటని, ప్రభుత్వానికి డబ్బున్నవారే ముఖ్యమా? అని పేర్ని నిలదీశారు.

Perni Nani పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని అంత‌ మాట అనేశాడు

Perni Nani : పేర్ని నాని .. కూటమి ప్రభుత్వాన్ని అంత‌ మాట అనేశాడు..!

Perni Nani : కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ నాని ఇలా అనేసాడేంటి..?

ఎన్నికల ముందు కూటమి నాయకులు చేసిన హామీలు, ఇచ్చిన భరోసాలు ఇప్పుడు విస్మరణకు గురయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అప్పుల పాలయ్యిందని, రాష్ట్రం శ్రీలంక స్థితికి చేరుకుంటుందని అప్పట్లో విపక్షాలు చెప్పిన దుష్ప్రచారం ఎంత నిరాధారమో ఇప్పుడు తేలిందన్నారు. చంద్రబాబును పెద్ద ఆర్థికవేత్తగా చూపిస్తూ, ఆయన్నే సీఎం చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మాధ్యమాలు చేసిన ప్రచారాన్ని ఆయన విమర్శించారు. అప్పులు అవసరం లేకుండా సంపద సృష్టిస్తారన్న మాటలు ఇప్పుడు తేలికపాటుగా మారిపోయాయని చెప్పారు.

ప్రజలు మోసపోయిన మాటలను నమ్మి ఓటేసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏడాది తిరగకముందే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎవ్వరూ ఊహించని స్థాయిలో రికార్డు స్థాయిలో అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా అంచునకు తీసుకొచ్చారని ఆరోపించారు. కూటమి నాయకులు చేసిన వాగ్దానాలన్నీ వృథా అయ్యాయని, ఈ విధంగా పాలన సాగితే ప్రజలకు గతి లేదని, రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడిపోతుందని ఆయన హెచ్చరించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది