Posani Krishna Murali Wife : ఆరోగ్యం బాగోలేదని చెప్పిన కూడా మా బెడ్ రూంలోకి వచ్చి ఆయనని తీసుకెళ్లారన్న పోసాని భార్య
ప్రధానాంశాలు:
Posani Krishna Murali Wife : ఆరోగ్యం బాగోలేదని చెప్పిన కూడా మా బెడ్ రూంలోకి వచ్చి ఆయనని తీసుకెళ్లారన్న పోసాని భార్య
Posani Krishna Murali Wife : తెలుగు రాష్ట్రాలలో పోసాని కృష్ణ మురళి అరెస్ట్ సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని పై చర్యలు తీసుకున్నారు. అరెస్ట్ చేసిన పోసానిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Posani Krishna Murali Wife : ఆరోగ్యం బాగోలేదని చెప్పిన కూడా మా బెడ్ రూంలోకి వచ్చి ఆయనని తీసుకెళ్లారన్న పోసాని భార్య
Posani Krishna Murali Wife వద్దన్నా కూడా..
ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. పోసానిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 196, 353 (2), 111 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోసాని అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. పోసాని ఆరోగ్యం బాలేదని చెప్పినా వినకుండా రాత్రికి రాత్రే పోలీసులు తీసుకెళ్లారు : పోసాని భార్య
పోలీసులు నాకు నోటీసులు ఇస్తే నేను తీసుకొను అని చెప్పాను అని పోసాని భార్య అన్నారు. అతనినిటైమ్ లో తీసుకెళ్లొచ్చు కదా ? నైట్ లోనే పోసానిని ఎందుకు తీసుకెళ్లారు ? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే ఏదో PS పేరు చెప్పి హడావుడిగా తీసుకెళ్లారు అని పోసాని భార్య స్పష్టం చేసింది. ఆరోగ్యం బాగోలేదని చెప్పిన కూడా రాత్రికి రాత్రే ఆయనని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పోసాని భార్య స్పష్టం చేసింది.