Ys jagan : కమ్మ వర్సెస్ రెడ్డి.. ఆ ఇద్దరే జగన్ కు కీలకం.. బాబుకు శాపం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys jagan : కమ్మ వర్సెస్ రెడ్డి.. ఆ ఇద్దరే జగన్ కు కీలకం.. బాబుకు శాపం

Ys jagan : ఎవరెన్ని చెప్పిన కానీ ఆంధ్ర రాజకీయాల్లో కులం ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తునే ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశము చేసిన నాటి నుండి కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్లు మారిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ పోషించిన పాత్రను ఇప్పుడు వైస్సార్సీపీ పోషిస్తుంది అంతే తేడా.. టీడీపీ అంటే కమ్మ , వైస్సార్సీపీ అంటే రెడ్డి అన్నట్లు మారిపోయింది. ఇక జనసేన ఏమో కాపు నేతల పార్టీ,బీజేపీ ఏమో మతపరమైన పార్టీగా ముద్ర వేసుకొని రాజకీయాలు […]

 Authored By brahma | The Telugu News | Updated on :9 March 2021,1:30 pm

Ys jagan : ఎవరెన్ని చెప్పిన కానీ ఆంధ్ర రాజకీయాల్లో కులం ఎప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తునే ఉంటుంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశము చేసిన నాటి నుండి కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్లు మారిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ పోషించిన పాత్రను ఇప్పుడు వైస్సార్సీపీ పోషిస్తుంది అంతే తేడా.. టీడీపీ అంటే కమ్మ , వైస్సార్సీపీ అంటే రెడ్డి అన్నట్లు మారిపోయింది. ఇక జనసేన ఏమో కాపు నేతల పార్టీ,బీజేపీ ఏమో మతపరమైన పార్టీగా ముద్ర వేసుకొని రాజకీయాలు చేస్తున్నాయి.

రెడ్ల పార్టీగా ముద్ర పడిన వైసీపీలో జగన్ మోహన్ రెడ్డిని అమితంగా అభిమానించే వ్యక్తులు ఎవరయ్యా అంటే ఇద్దరు కమ్మ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు మంత్రి కొడాలి నాని, మరొకరు సినీ రచయిత, నటులు పోసాని కృష్ణమురళి. ఈ ఇద్దరు కూడా జగన్ మీద ఎలాంటి ఆరోపణలు వచ్చిన మొదటిగా స్పందించే వ్యక్తులు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుండి ఎవరైనా జగన్ మీద విమర్శలు చేస్తే, ఖచ్చితంగా ఈ ఇద్దరు ఎదురుదాడి చేయటం మనం చూస్తూనే ఉన్నాం.

posani krishnamurali kodali nani these two are the key to Ys jagan

posani krishnamurali kodali nani these two are the key to Ys jagan

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఏపీలో రెడ్లు, క‌మ్మ నేత‌ల మ‌ధ్య సంబంధాలు ఉప్పునిప్పులా ఉన్నాయి. అలాంటిది జ‌గ‌న్‌తో కొడాలి నాని, పోసాని కృష్ణ‌ముర‌ళీకి పెన‌వేసుకున్న ఆత్మీయానురాగాల బంధం సామాన్యమైంది కాదు. ఒకసారి అసెంబ్లీ లో జగన్ మాట్లాడుతూ త‌న కేబినెట్‌లో త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన వ్య‌క్తి వ్య‌క్తుల్లో కొడాలి నాని ముందు వ‌రుస‌లో ఉంటార‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దానికి తగ్గట్లే నాని కూడా ఎప్పుడు జగన్ కు విధేయుడిగా ఉంటూ ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు.

ఇక పోసాని కృష్ణమురళి నైజం గురించి అందరికి తెలిసిందే, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం ఆయన సొంతం. త‌న‌కు రాజ‌కీయాల‌తో సంబంధం లేద‌ని, కేవ‌లం జ‌గ‌న్ మాట‌పై నిల‌బ‌డే నిజాయితీనే త‌న‌ను ఆయ‌న‌కు ద‌గ్గ‌ర చేసింద‌ని ఆ సినీ ప్ర‌ముఖుడు అనేక సంద‌ర్భాల్లో చెప్పారు.తాను కూడా క‌మ్మ‌వాడినే అని, జ‌గ‌న్ ఎప్పుడూ కుల దృష్టితో చూడ‌ర‌ని పోసాని చెప్ప‌డం తెలిసిందే. పెద్దగా మీడియా ముందుకు రాని పోసాని, సరిగ్గా ఎన్నికల సమయానికి ముందు ప్రెస్ మీట్ లు పెట్టి టీడీపీ కి చాకిరేవు పెట్టటం మనం గమనించవచ్చు. మున్సిపల్ ఎన్నికల జరగబోతున్నా ఈ టైం లో నిన్న పోసాని మాట్లాడిన మాటలు టీడీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

వైసీపీ తరుపున ఎవరెన్ని మాట్లాడిన కానీ, కొడాలి నాని, పోసాని కృష్ణమురళి చేసే కామెంట్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎదో మూవీలో చెప్పినట్లు ఆ కిక్కే వేరబ్బా అన్నట్లు ఉంటాయి. ఇదే స‌మ‌యంలో భూతుల మంత్రిగా ప్ర‌త్య‌ర్థులు కొడాలి నానిపై ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా …ఆయ‌న మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. అదే విధంగా పోసాని కూడా ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు.. ఈ ఇద్దరు జగన్ కు ఒక కవచంగా మారిపోయారనే చెప్పాలి.. అదే సమయంలో బాబుకు శాపంగా మారిపోయారని కూడా చెప్పాలి.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది