MLA Wife Birthday : ఎమ్మెల్యే భార్య పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న పోలీస్ అధికారులు.. పెద్ద ఝలక్ ఇచ్చారుగా..!
MLA Wife Birthday : పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బర్త్ డే వేడుకల్లో పోలీసులు హడావుడి చేశారు. స్వయంగా పోలీసులే కేక్ తీసుకుని పుల్లారావు ఇంటికి వెళ్లి వెంకటకుమారి బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. దీంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పుట్టిన రోజు వేడుకల్లో ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు పాల్గొన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే భార్య […]
MLA Wife Birthday : పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసుల తీరు వివాదస్పదంగా మారింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి బర్త్ డే వేడుకల్లో పోలీసులు హడావుడి చేశారు. స్వయంగా పోలీసులే కేక్ తీసుకుని పుల్లారావు ఇంటికి వెళ్లి వెంకటకుమారి బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. దీంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పుట్టిన రోజు వేడుకల్లో ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు పాల్గొన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే భార్య కేక్ కోస్తుండగా ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు చప్పుట్లు కొడుతూ ఆమెకు హ్యాపీ బర్త్ డే చెబుతున్న ఘటన వివాదాస్పదమైంది.
MLA Wife Birthday : భలే పనైందిగా..!
చిలకలూరిపేట టౌన్, రూరల్ సీఐలు సుబ్బనాయుడు, రమేష్, ఎసైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్‌ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్‌పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను సంరక్షించాల్సిన పోలీసులు ఇలా దిగజారిపోయి రాజకీయ నేతలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు.
ఏ పదవిలో ఎమ్మెల్యే భార్య బర్త్ డే వేడుకల్లో పోలీసులు పాల్గొనడం, ఆమెకు అభినందనలు తెలియజేయడం, ఆమె ముందు విధేయత చాటుకోవడంపై అంతటా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై పత్రికల్లోనూ పెద్ద ఎత్తున వార్తలు, ఫొటోలు రావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యే భార్య వెంకట కుమారి (వెంకాయమ్మ) బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసు అధికారులు షాకాజు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం పల్నాడు జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లింది. ఎమ్మెల్యే భార్య బర్త్ డే వేడుకల వ్యవహారం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ఆయన సీరియస్ అయ్యారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న ఐదుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలు షోకాజు నోటీసులు ఇచ్చారు. మరి ఇది ఎంత వరకు వెళుతుందో చూడాలి.