Rajinikanth : చంద్రబాబు కోసం రంగంలోకి రజినీకాంత్.. దద్దరిల్లిన సెంట్రల్ జైలు.. షాక్ లో జగన్?

Advertisement

Rajinikanth : ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధించారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నందమూరి ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదికి వచ్చింది. నారా భువనేశ్వరి, నారా లోకేష్, బాలకృష్ణ అందరూ రాజమండ్రిలోనే మకాం వేశారు. చంద్రబాబుకు ఎప్పుడు ఏమౌతుందో అని టెన్షన్ పడుతున్నారు.

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లారు. నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురూ చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లారు. ఇక.. చంద్రబాబును పరామర్శించడానికి ఏకంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ వస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. రజినీకాంత్ రాజమండ్రి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. టీడీపీ నేతలు కూడా అదే చెబుతుండటంతో రాజమండ్రిలో హడావుడి వాతావరణం నెలకొన్నది.ప్రస్తుతం చంద్రబాబును అతి కొద్ది మంది మాత్రమే కలిశారు. అందరు టీడీపీ నేతలకు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యే చాన్స్ లేదు. చంద్రబాబు, రజినీకాంత్ మధ్య సన్నిహిత సంబంధం ఉంది. చంద్రబాబు అరెస్ట్ కాగానే నారా లోకేష్ కు ఫోన్ చేసిన రజినీకాంత్.. ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
rajinikanth entry at rajamundry central jail for chandrababu
rajinikanth entry at rajamundry central jail for chandrababu

Rajinikanth : రజినీకాంత్ నిజంగానే చంద్రబాబును కలుస్తున్నారా?

అలాగే.. ఆయన్ను పరామర్శించడానికి కూడా రజినీకాంత్ వస్తానని చెప్పారని టీడీపీ నేతలు చెప్పారు. ఆయన ఎప్పుడు వస్తారు.. అనే దానిపై క్లారిటీ లేదు కానీ.. ఆయనకు మరి చంద్రబాబును కలిసే ములాఖత్ లభిస్తుందా? అనేది తెలియదు. ఇప్పటికే నారా భువనేశ్వరి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అతి కొద్ది మంది టీడీపీ ముఖ్య నేతలు మాత్రమే ఆయన్ను కలిశారు. ఎందుకంటే వారానికి రెండు రోజులు మాత్రమే చంద్రబాబుకు ములాఖత్ ఉండగా.. ఇప్పుడు రజినీకాంత్ కు ములాఖత్ లభిస్తుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Advertisement