Ram Mohan Naidu : వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు..!!
Ram Mohan Naidu : పాత పార్లమెంటు భవనంలో సోమవారం జరిగిన పార్లమెంటు సమావేశాలలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. చేసిన వ్యాఖ్యలను టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు కనిపించారు. ఏక వచనంతో తనపై దుర్భాషలాడటం జరిగిందని మండిపడ్డారు. పార్లమెంటులో పులివెందుల పంచాయతీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి పార్లమెంటు సభ్యుడు అనే గౌరవం కూడా లేకుండా స్థానాన్ని లెక్కచేయకుండా ఎక్కడ మాట్లాడుతున్నామో అది కూడా లెక్కచేయకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది వైసీపీ పార్టీ వాళ్లకే చెల్లుతుంది అని అన్నారు.
లోక్ సభలో చేపట్టిన చర్చల్లో పాల్గొనడం జరిగింది. అయితే చంద్రబాబుపై ఏపీలో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వైసిపి ప్రభుత్వం అరెస్టు చేసిందో అనే అంశాన్ని సభలో ప్రస్తావించాము. ఈ క్రమంలో చంద్రబాబు పేరు చెప్పగానే వైసీపీ ఎంపీలు వారి సీట్ల కింద కుంపటి పెట్టినట్టు ఎగిరారు. చంద్రబాబు పేరు చెబితే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. చంద్రబాబు అరెస్టు అంశాన్ని చెబితే వైసిపి ఎంపీలు మాట్లాడినవ్వకుండా ఆపే ప్రయత్నం చేశారు.
ఈ రకంగానే ఏపీ అసెంబ్లీలోనే ఇలాంటి పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు పార్లమెంటులో కూడా చూస్తున్నాం. పార్లమెంటులో ఎంపీలకు ఉన్న గౌరవాన్ని అగరవపరిచే విధంగా మాట్లాడారు అని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.