Ramoji Rao : ఈ ప్రశ్నలకి రామోజీ ఆన్సర్ చేయగలడా ?? ది తెలుగు న్యూస్ ఓపెన్ ఛాలెంజ్
Ramoji Rao : ఎవరికైనా మంచి జరిగితే కొందరు ఓర్వరు. నిజానికి ఇది మనిషి గుణంలోనే ఉంటుంది. ఒకరు బాగుపడితే.. ఒకరికి లబ్ధి చేకూరితే ఇంకొకరికి నచ్చదు. తనకంటే ఎవ్వరూ ఎక్కువ బాగుపడకూడదు. అందుకే.. వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా.. ప్రజల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా.. ప్రభుత్వ ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకున్నా ఇలాగే.. ప్రతిపక్షాలు బురద జల్లుతూ ఉంటాయి. సరే.. ప్రతిపక్షాలు అంటే వాటి పనే అది కాబట్టి ఓకే అనుకుందాం. మరి ఈనాడు రామోజీ రావు పరిస్థితి ఏంటి. ఆయనకు ఎందుకు ఏపీ ప్రజల మీద అంత కుళ్లు. వాళ్లు బాగుపడితే చూసి ఓర్వలేడా? ఆయనకు వందల, వేల కోట్ల సామ్రాజ్యం ఉండొచ్చు. చంద్రబాబును అడ్డం పెట్టుకొని, ఈనాడు పేపర్ ను అడ్డం పెట్టుకొని ఆయన వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు కానీ.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ విధానం తీసుకొస్తే ఆయనకు నొప్పి వచ్చిందట.
ప్రభుత్వ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సీపీఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కు బదులుగా జీపీఎస్ అనే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానిపై కూడా బురద జల్లుతోంది పచ్చ మీడియా. ప్రతిపక్ష టీడీపీ పార్టీ కూడా జీపీఎస్ విధానంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ.. రామోజీ రావు మాత్రం రెచ్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎస్ విధానాన్ని మెచ్చుకున్నారు. సీఎం జగన్ కు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఉద్యోగ సంఘాలు హర్షాతికేరాలు వ్యక్తం చేస్తే మరి ఈనాడుకు ఎందుకు ఇంత కక్ష ప్రభుత్వ ఉద్యోగులపై.
Ramoji Rao : మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు బయటపడ్డాయనా ఈ కుళ్లు కుతంత్రాలు
మార్గదర్శి చిట్ ఫండ్ లో ఎన్ని అక్రమాలు జరిగాయో జగన్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. అందుకేనా రామోజీకి అంత బాధ. మీరు ఎన్ని ఆర్థిక అక్రమాలకు పాల్పడినా నోర్మూసుకొని కూర్చోవాలా? ఇలాంటి నీచపు రాతలు ఎవ్వరూ రాయరు. ఉద్యోగులను ఆదుకుంటే ఏడ్చే మీడియా ఎందుకు. ఇలాంటి పచ్చ మీడియా ఏపీకి అవసరమా? ఇలాంటి దుర్మార్గపు, దుష్ట మీడియా ఎందుకు. మీడియా అంటే ప్రజల బాగు కోసం పాటుపడాలి కానీ.. ప్రజలను ముంచే మీడియా ఎందుకు.. ప్రజలు బాగుపడుతుంటే చూసి ఓర్వలేని మీడియా ఎందుకు. ఇలాంటి పచ్చ, చెత్త మీడియాలను ఏపీ ప్రజలు పాతాళంలోకి తొక్కేయాలి. అప్పుడే ఏపీ ప్రజలు ప్రశాంతంగా ఉండగలరు. లేదంటే వీళ్లు మన మధ్యనే చిచ్చు పెట్టి రచ్చ చేస్తారు.