Ration Card : గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు
ప్రధానాంశాలు:
Ration Card : గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు
Ration Card : రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే నూతన రేషన్ కార్డులు అందజేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సభ్యుల ఆందోళనలను ప్రస్తావించారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విషయంలో గత ప్రభుత్వ పాత్రను ఈ సందర్భంగా ఆయన హైలైట్ చేశారు.

Samantha : చైతుతో చేసిన ‘ఏ మాయ చేసావే’ తనకెంతో ప్రత్యేకమన్న సమంత
బియ్యం అక్రమ రవాణాను తగ్గించడానికి తీసుకున్న చర్యలను మంత్రి వివరించారు. ప్రస్తుతం తాము రేషన్ బియ్యం కోసం కిలోకు రూ. 46.10 ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. PDS కార్యకలాపాల కోసం 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Ration Card QR కోడ్‌లతో కూడిన రేషన్ కార్డులు
కాకినాడ పోర్టులో అధికారులు 50 వేల మెట్రిక్ టన్నుల అక్రమ రవాణా బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటే అందులో 25 మెట్రిక్ టన్నులు PDS బియ్యంగా గుర్తించినట్లు మంత్రి ప్రకటించారు. పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సమీప భవిష్యత్తులో QR కోడ్‌లతో కూడిన రేషన్ కార్డులను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. eKYC, AI నిఘా కెమెరాల అమలుతో రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.