RK Roja : మంత్రి రోజా పల్లెనిద్ర ప్రోగ్రాం.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RK Roja : మంత్రి రోజా పల్లెనిద్ర ప్రోగ్రాం.. వీడియో

 Authored By anusha | The Telugu News | Updated on :27 November 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  RK Roja : మంత్రి రోజా పల్లెనిద్ర ప్రోగ్రాం.. వీడియో

  •  RK Roja palle nidra program in AP

RK Roja : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రతిరోజు ఒక గ్రామంలో పర్యటిస్తూ పల్లెనిద్ర చేస్తున్నారు. రాత్రి అక్కడే ఉండి వైసిపి పార్టీకి మద్దతుగా జగన్ Ys Jagan కార్యక్రమాన్ని జనాలలోకి తీసుకెళుతున్నారు. నగరి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన రోజా పల్లెనిద్ర చేస్తూ ఇంటింటికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వడమాల పేట మండలం అప్పలాయకుంట ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం ఈ గ్రామంలో బస చేసి అక్కడి గ్రామస్తుల సమస్యలపై ఆరా తీశారు.

నిన్న పుత్తూరు మండలం గుండ్రాజుకుప్పం ఎస్సీ కాలనీలో మంత్రి ఆర్కే రోజా పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా గుండ్రాజుకుప్పం ఎస్సీ కాలనీలో బస చేసిన మంత్రి రోజా అక్కడి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గం దిశగా అడుగులు వేస్తున్నారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పల్లె నిద్ర చేసి ఉదయం స్థానిక వైసీపీ క్యాడర్ తో పాటు గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి క్యాడర్లో జోష్ నింపారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వైసిపి ప్రభుత్వం ఏం చేసిందో వివరించారు.

గ్రామంలోని మహిళలతో సెల్ఫీలు తీసుకొని సరదాగా గడిపారు. నాలుగున్నరేళ్ల సంక్షేమ పాలన, మరోసారి ఏపీకి జగన్ సీఎం CM Ys Jagan ఎందుకు కావాలో వివరిస్తూ ఈ వినూత్న కార్యక్రమానికి మంత్రి రోజా Minister Roja శ్రీకారం చుట్టారు. నగరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తిరుగుతూ అక్కడే బస చేసి పల్లెనిద్ర చేస్తున్నారు. మారుమూల గ్రామాలలో కూడా రోజా పల్లె నిద్ర చేస్తూ వైసీపీ పార్టీ ఎటువంటి పథకాలను అందించిందో, మళ్లీ సీఎం గా జగన్ ను ఎందుకు ఎన్నుకోవాలో గ్రామ ప్రజలతో వివరించారు. పల్లె నిద్రకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది