
RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించి, ప్రజల ఆశలు తుడిచిపెట్టిందని ఆమె విమర్శించారు. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు కనుమరుగయ్యాయని, “సూపర్ సిక్స్” ప్రకటనలు గాలిలో కలిసిపోయాయని ఆరోపించారు. సినిమాల్లోని డైలాగులతో రాజకీయాల్లో ప్రభావం చూపించలేరని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పటికీ షూటింగ్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.
RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!
“ఎన్నికల ముందు సుగాలీ ప్రీతి విషయంలో గొంతెత్తిన పవన్.. గెలిచిన తర్వాత వారికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు” అంటూ ఆర్కే రోజా తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రజలందరికీ చూపే మోసం అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ ఓటుతో పవన్‌కు గౌరవం ఇచ్చారని, అయితే ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా, సినిమా కార్యక్రమాలకే మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపైన కాకుండా, వ్యక్తిగత ప్రచారం మీదే దృష్టి పెట్టడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారని, అయితే మహిళల అక్రమ రవాణాపై ఆయన ఎందుకు నోరు మెదపటం లేదని ఆర్కే రోజా ప్రశ్నించారు. వైఎస్ జగన్ సభలకు జనాన్ని రానివ్వకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో కనిపిస్తుంది. అధికారం శాశ్వతం కాదు. ప్రజలు చూస్తున్నారు.. క్షమించరు అని హెచ్చరించారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గుర్తుంచుకుంటారని రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు…
This website uses cookies.