Roja Vs Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలకి రోజా సెటైర్లు..!

 Authored By aruna | The Telugu News | Updated on :22 February 2024,3:00 pm

Roja Vs Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కోసం కుప్పంలో పర్యటించారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు గారికి రెస్ట్ ఇచ్చి నేను కుప్పంలో పోటీ చేస్తాను అని ఆమె వ్యాఖ్యానించారు. అందరూ చంద్రబాబు గారిని ముసలాయన అనుకుంటారు కానీ ఆయన యూత్ కంటే ఎక్కువగా షార్ప్ గా ఆలోచిస్తారు. యువత కోసం ఏం చేయాలి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి అని ఆలోచిస్తుంటారు. రాష్ట్ర యువత కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఐటి కంపెనీలను తీసుకొచ్చిన చంద్రబాబు గారు యువత కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అలాగే మహిళలకు ఎలాంటి రంగంలో అవకాశాలు ఇవ్వాలని ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో భోజనం చేసే సమయంలో కూడా మహిళలకు ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఏ రంగంలో అవకాశం ఇస్తే బాగుంటుంది. ఏ పథకం పెడితే మహిళలకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది. యువతకు ఎలాంటి అవకాశాలు, ఉద్యోగాలు, కంపెనీలు, టెక్నాలజీ తీసుకురావాలని ఆలోచిస్తారు.

నేను కూడా మహిళల అభివృద్ధి కోసం నాకు తోచిన సలహాలు నా భర్తతో పంచుకుంటాను. ఎన్నికల తర్వాత మహిళల భవిష్యత్తు మరో కొత్త మలుపులు తిప్పాలని చంద్రబాబు గారు మంచి ప్లానింగ్ తో ఉన్నారు. ఆయనను సీఎం చేసుకొని భవిష్యత్తును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని ఆమె తెలిపారు. అయితే ఆమె కుప్పం సభలో చంద్రబాబు గారికి రెస్ట్ ఇచ్చి నేను కుప్పంలో పోటీ చేస్తాను అని తన మనసులో ఉన్న కోరిక గురించి చెప్పారు. సరదాగా చెప్పిన ఆ వ్యాఖ్యలకి ఆమెపై మంత్రులు సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మంత్రి రోజా నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని నారా భువనేశ్వరి ప్రసంగం చూస్తే స్పష్టం అవుతుందని అన్నారు.

మేము ఏదైతే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చామో ఇవాళ భువనేశ్వరి కూడా అదే చెప్పారని తెలిపారు. చంద్రబాబు నాయుడుకు విశ్రాంతి తీసుకునే వయసు వచ్చింది. కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పని అయిపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుంది. మూడుసార్లు సీఎం గా పని చేసిన చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారు. ఈనెల 26న సీఎం వైఎస్ జగన్ కుప్పం వస్తున్నారు. కుప్పం ప్రజల చిరకాల కోరిక అయిన హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నారు. కుప్పంలో ప్రతి ప్రాంతాన్ని వైసీపీ అభివృద్ధి చేస్తుంది. ఈ విషయం అర్థమైంది కాబట్టే నారా భువనేశ్వరి తెలివిగా మా ఆయన రెస్ట్ తీసుకోవాలి నేను పోటీ చేస్తాను అని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆమెకు అర్థమైందని అందరూ నవ్వుకుంటున్నారు. కుప్పం ప్రజలకి ఏమి చేయలేని చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు కూడా ఏమీ చేయడని ప్రజలు తెలుసుకున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో కుప్పం సహా 175 కి 175 స్థానాల్లో వైసీపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని రోజా వ్యాఖ్యానించారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి