Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ కూడా రంగంలోకి దిగబోతున్నారా.. వైసీపీని అంత మాట అనేసాడేంటి..!
Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మెగా మేనల్లుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ సినిమాల కన్నా రాజకీయాలపై కూడా ఎక్కువ దృష్టి సారించాడు. ఇటీవల అల్లు అర్జున్..మెగా ఫ్యామిలీతో కాస్త దూరంగా ఉంటున్న నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ఇన్‌స్టాలో బన్నీని డీయాక్టివేట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వైఎస్‌ఆర్ […]
ప్రధానాంశాలు:
Sai Dharam Tej : సాయి ధరమ్ తేజ్ కూడా రంగంలోకి దిగబోతున్నారా.. వైసీపీని అంత మాట అనేసాడేంటి..!
Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మెగా మేనల్లుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ సినిమాల కన్నా రాజకీయాలపై కూడా ఎక్కువ దృష్టి సారించాడు. ఇటీవల అల్లు అర్జున్..మెగా ఫ్యామిలీతో కాస్త దూరంగా ఉంటున్న నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ఇన్‌స్టాలో బన్నీని డీయాక్టివేట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. సాయి ధరమ్ తేజ్‌ను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ ఫ్యాన్స్.
Sai Dharam Tej తేజ్ ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్ భద్రమైన చేతుల్లో ఉందని గతంలో తేజ్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఇప్పుడెందుకు స్పందించడం లేదని సాయి ధరమ్ తేజ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎక్స్ వేదికగా వైసీపీ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికి ఆయన ‘ఎగ్ పఫ్స్ అని కామెంట్స్ చేయడంతో దమ్ముంటే ఆధారాలు పెట్టాలని సవాల్ విసురుతున్నారు. మధ్యలో జనసేన ఫ్యాన్స్ కూడా వచ్చేశారు. వారు కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్స్‌కు కౌంటరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఘన విజయం అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, జనసేన వర్గాల్లో ఆనందం వెల్లివిరిసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖలను కేటాయించడంతో ఆ సంతోషం రెట్టింపైంది.
అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏక్టివ్ గా ఉండటంతో ఆయనపై విమర్శలు చేసేందుకు కానూ సాయి తేజ్ ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి లాగుతున్నారు. అయితే సాయి తేజ్ ఎగ్ పఫ్స్ అనడంతో వైసిపి కార్యకర్తలు… ఎగ్ పప్స్ పై… ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేయటం మొదలెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తణుకు అన్న క్యాంటీన్లో అపరిశుభ్రమైన మురికి నీటిలో .. ప్లేట్లను కడుగుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో వైరల్ కాగానే వెంటనే వైసీపీ సోషల్ మీడియా కూడా అలర్ట్ అయింది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు వైసిపి నేతలు. అయితే ఆ వీడియోలో నిజం లేదని ఖండనలు వస్తున్నాయి.