NTR District : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి గుమ్మళ్ల సృజన కలెక్టర్‌గా నియమించబడ్డారు. సృజన 2015లో కృష్ణాజిల్లా సబ్ కలెక్టర్‌గా చేశారు. ఆమె గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ సమయంలో కరోనా ప్రబలుతుండగా, ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చి, మెటర్నటీ సెలవు ఉపయోగించుకునే అవకాశం ఉన్నా, తన బిడ్డతో విధులకు హాజరుకావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. గుమ్మళ్ల సృజన తండ్రి బలరామయ్య ఐఏఎస్ అధికారి. తల్లి సుగుణశీల గృహిణి. భర్త రవితేజ హైకోర్టు అడ్వకేట్‌గా చేస్తున్నారు. సృజన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లో జరిగింది. బీఏ సెయింటాన్స్‌లో, ఎంఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. సృజన భర్త రవితేజ ప్రముఖ సోషలిస్టు నాయకుడు వాసిరెడ్డి కృష్ణారావు మనవడు.
పక్కా తెలుగు కుటుంబానికి చెందిన కలెక్టర్ సృజన తన పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. పనులు విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తూ ఉంటారు. సృజన తండ్రి బలరామయ్య రిటైర్ట్ ఐఏఎస్. ఆమె భర్త రవితేజ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తున్నారు. సృజన హైదరాబాద్‌లో చదువుకున్నారు. బీఏ సెయింటాన్స్‌లో, ఎంఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. అయితే కలెక్టరమ్మ చేసిన పనికి ప్రతి ఒక్కరు హ్యట్సాఫ్ అంటున్నారు.
సాధారణంగా ఎవరైనా ఆఫీసు బయట చెప్పులు విడిచి లోపలికి రావలెను అని బోర్డు పెడతారు. కానీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసు బయట మాత్రం పాదరక్షలు ధరించి లోనికి వెళ్లండి అని బోర్డులు పెట్టారు. ఈ బోర్డులు అక్కడికి వెళ్లినవారికి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించాయి. వివరాలు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ సృజన కావాలనే ఈ బోర్డులు ఏర్పాటు చేయించారు. కొద్ది రోజుల క్రితం తనను కలిసేందుకు వచ్చిన రైతులు.. చెప్పులు బయట విడిచి.. లోపలికి రావడాన్ని ఆమె గమనించారట. ఆఫీసు లోపల స్టాఫ్ అంతా పాదరక్షలు ధరించే తిరుగుతారు. కానీ అందరి ఆకలి తీర్చే రైతులు అలా రావడం ఆమెకు నచ్చలేదు. దీంతో తన క్యాబిన్లోకి ఎవరైనా చెప్పులతోనే రావచ్చని బోర్డు పెట్టించారు. ఇప్పుడు ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
This website uses cookies.