Singayya Wife : లోకేష్ మనుషులు వచ్చి నన్ను బెదిరించారు – సింగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
Singayya Wife : లోకేష్ మనుషులు వచ్చి నన్ను బెదిరించారు - సింగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
టీడీపీ మనుషులు.. తాము చెప్పినట్లు చెప్పాలంటూ బెదిరించారు - సింగయ్య భార్య
Singayya wife : సింగయ్య మృతిపై ఆయన భార్య లూర్దు మేరి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త చనిపోయిన తర్వాత నారా లోకేష్‌కు చెందినవారంటూ సుమారు 50 మంది ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె వెల్లడించారు. “మీరు మా కులస్తులే” అంటూ , వారు చెప్పినట్లు మాట్లాడాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. అంతేగాక కాగితాలపై ఏదో రాసుకుని సంతకాలు చేయమని, అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారని మేరీ తెలిపింది.

Singayya Wife : లోకేష్ మనుషులు వచ్చి నన్ను బెదిరించారు – సింగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
Singayya wife : సింగయ్య భార్య వ్యాఖ్యలు లోకేష్ కు కొత్త చిక్కులు తీసుకరాబోతున్నాయా..?
సింగయ్య మృతి అనుమానాస్పదంగా ఉందని ఆమె ఆరోపించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం, మార్గమధ్యంలో అంబులెన్స్‌లో ఏదో జరిగిందని అనుమానం కలుగుతోందని చెప్పుకొచ్చింది. చిన్న చిన్న గాయాలకే ఆయన మరణించడం పై ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది.
అలాగే పోలీసులు కూడా ఒత్తిడి చేస్తున్న తీరును ఆమె వివరించారు. పోలీసులు వీడియో చూపిస్తూ సంతకాలు చేయాలని బలవంతం చేశారని లూర్దు మేరి ఆరోపించారు. తమపై రకరకాల ఒత్తిడులు తెచ్చి సత్యాన్ని దాచే ప్రయత్నం జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
సింగయ్య మృతిపై నారా లోకేష్ మీద సంచలన ఆరోపణలు చేసిన భార్య లూర్దు మేరి
సింగయ్య చనిపోయిన తర్వాత నారా లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చారు
తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారు.. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు
కాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారు.. సంతకం… pic.twitter.com/YQVND7is1g
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2025