Ycp Party : వైసీపీలో వారిపై నిరసన గళం.. పక్కన పెట్టాల్సిందేనంటూ పెద్ద ఎత్తున డిమాండ్..!
Ycp Party : వైసీపీలో పరిస్థితి ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు వరకు జగన్‌కు జై కొట్టిన నాయకులు.. ప్రస్తుతం జగన్ పార్టీలో మేం ఉండలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధ్యక్షుడి వైఖరి కారణంగా స్థానికంగా కొందరు పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఆ పార్టీలోని ప్రముఖులమని చెప్పుకునే కొందరి వల్ల ఇబ్బంది పడుతుండగా, వారు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ప్రజల్లో వైసీపీపై రోజురోజుకు అభిమానం తగ్గి.. […]
ప్రధానాంశాలు:
Ycp Party : వైసీపీలో వారిపై నిరసన గళం.. పక్కన పెట్టాల్సిందేనంటూ పెద్ద ఎత్తున డిమాండ్..!
Ycp Party : వైసీపీలో పరిస్థితి ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు వరకు జగన్‌కు జై కొట్టిన నాయకులు.. ప్రస్తుతం జగన్ పార్టీలో మేం ఉండలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధ్యక్షుడి వైఖరి కారణంగా స్థానికంగా కొందరు పార్టీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఆ పార్టీలోని ప్రముఖులమని చెప్పుకునే కొందరి వల్ల ఇబ్బంది పడుతుండగా, వారు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ప్రజల్లో వైసీపీపై రోజురోజుకు అభిమానం తగ్గి.. వ్యతిరేకత పెరుగుతోందని.. ఈసమయంలో పార్టీలో ఉంటే రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోనే వైసీపీని వీడాలనే నిర్ణయానికి కొందరు నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.
Ycp Party వారిపై ఆగ్రహం..
వన భోజనాల ఏర్పాటు పేరుతో పలు జిల్లాల్లో ఈ ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు తమ గళం వినిపించారు. వైసీపీలో కొందరు నాయకులను పక్కన పెట్టాలని, నేరుగా జగన్ బాధ్యతలు చూడాలనికోరుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో జగన్ ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించి పక్కకి తప్పుకోవడంతో మా కేడర్ ఇబ్బంది పడుతుందని అంటున్నారు. పార్టీలో ఇప్పుడున్న వారిని మార్చాలని అనంతపురానికి చెందిన ఓ నాయకుడు డిమాండ్ చేశారు. మెజారిటీ నాయకుల మాట ఇలానే ఉంది. ఇటీవల జిల్లాల కో ఆర్డినేటర్లుగా.. ఆరుగురికి జగన్ బాధ్యతలు అప్పగించారు. మొత్తం ఉమ్మడి 13 జిల్లాలకు ఆరుగురిని కో ఆర్డినేటర్లుగా నియమించారు.
ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి, మిధున్‌రెడ్డి వంటివారిని మార్చాలని కోరుతున్నారు. బొత్స సత్యనారాయణ వంటివారిపై కూడా సొంత నేతల నుంచే అసంతృప్తి రగిలిపోతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యవహారంతో పార్టీ మెరుగు పడబోదని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. అనేక మంది నాయకులు ఉన్నారని, వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కోరుతున్నవారు కనిపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేయకపోతే రానున్న రోజులలో జగన్ మరిన్ని ఇబ్బందులు పడక తప్పదని పలువురు చెబుతున్న మాట.