
Tirumala Laddu : శ్రీవారి లడ్డూ విషయంలో కుట్ర జరిగింది.. చంద్రబాబుపై సుబ్రహ్మణ్య స్వామి కొత్త అనుమానాలు
Tirumala Laddu : వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపాలంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాఫ్తు చేయాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. కల్తీ నెయ్యి అంశంలో ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేశారని సుబ్రమణ్యస్వామి అన్నారు. అటు వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ పిటిషన్ వేశారాయన. రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో ఎంక్వైరీ జరపాలని కోరారు. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు కుట్ర కోణానికి సంబంధించి జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త తరహా కుట్ర కోణానికి తెర తీశారని సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ఇంతకూ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. – ఆవునెయ్యి శాంపిల్స్ పరీక్షలుచేసి.. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవటంతో వెనక్కు పంపించినట్లు టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. కల్తీ జరిగిందని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు పదే పదే బహిరంగంగా ప్రకటించటం దేనికి నిదర్శనం?ఇలా ఆరోపణలు చేసిన తర్వాత దర్యాప్తునకు ఆదేశిస్తారా? నిజానిజాలను నిర్దారించుకోకుండా భక్తుల్లో అలజడి క్రియేట్ చేయడం ఎంత వరకు కరెక్ట్.. లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకోకుండా ఎలా ఆరోపణలు చేస్తారు.
Tirumala Laddu : శ్రీవారి లడ్డూ విషయంలో కుట్ర జరిగింది.. చంద్రబాబుపై సుబ్రహ్మణ్య స్వామి కొత్త అనుమానాలు
కల్తీపై దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ నియమించటం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవటం లేదు. జులైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంతకాలం ఎందుకు సిట్ ను నియమించారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఒక ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు.ఒక క్రైస్తవుడిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా నియమిస్తారని హిందూవాదులు అగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు పత్రికల్లో పతాక స్థాయిల్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు. కల్తీ జరిగిందని కానీ.. చేపనెయ్యి.. కొవ్వు కలిసినట్లుగా ఎక్కడా లేదు. ఒకరి గుర్తింపును.. ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసి ఏజెన్సీలు సైతం ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సుబ్రమణ్య స్వామి హెచ్చరించారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.