Tirumala Laddu : శ్రీవారి ల‌డ్డూ విష‌యంలో కుట్ర జ‌రిగింది.. చంద్ర‌బాబుపై సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కొత్త అనుమానాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tirumala Laddu : శ్రీవారి ల‌డ్డూ విష‌యంలో కుట్ర జ‌రిగింది.. చంద్ర‌బాబుపై సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కొత్త అనుమానాలు

 Authored By ramu | The Telugu News | Updated on :14 October 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Tirumala Laddu : శ్రీవారి ల‌డ్డూ విష‌యంలో కుట్ర జ‌రిగింది.. చంద్ర‌బాబుపై సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కొత్త అనుమానాలు

Tirumala Laddu : వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపాలంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాఫ్తు చేయాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. కల్తీ నెయ్యి అంశంలో ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేశారని సుబ్రమణ్యస్వామి అన్నారు. అటు వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంలో విచారణ కోరుతూ పిటిషన్ వేశారాయన. రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో ఎంక్వైరీ జరపాలని కోరారు. అయితే ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు కుట్ర కోణానికి సంబంధించి జాతీయ మీడియాకి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

Tirumala Laddu జ‌ర జాగ్ర‌త్త‌..

ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త తరహా కుట్ర కోణానికి తెర తీశారని సుబ్ర‌మ‌ణ్య స్వామి ఆరోపించారు. ఇంతకూ స్వామి చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. – ఆవునెయ్యి శాంపిల్స్ పరీక్షలుచేసి.. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవటంతో వెనక్కు పంపించినట్లు టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. కల్తీ జరిగిందని సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు పదే పదే బహిరంగంగా ప్రకటించటం దేనికి నిదర్శనం?ఇలా ఆరోపణలు చేసిన తర్వాత దర్యాప్తునకు ఆదేశిస్తారా? నిజానిజాలను నిర్దారించుకోకుండా భక్తుల్లో అలజడి క్రియేట్ చేయ‌డం ఎంత వ‌రకు క‌రెక్ట్.. ల‌డ్డూ విష‌యంలో క‌ల్తీ జ‌రిగిందా లేదా అనేది తెలుసుకోకుండా ఎలా ఆరోప‌ణలు చేస్తారు.

Tirumala Laddu శ్రీవారి ల‌డ్డూ విష‌యంలో కుట్ర జ‌రిగింది చంద్ర‌బాబుపై సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కొత్త అనుమానాలు

Tirumala Laddu : శ్రీవారి ల‌డ్డూ విష‌యంలో కుట్ర జ‌రిగింది.. చంద్ర‌బాబుపై సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కొత్త అనుమానాలు

కల్తీపై దర్యాప్తు కోసం ప్రభుత్వం సిట్ నియమించటం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవటం లేదు. జులైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంతకాలం ఎందుకు సిట్ ను నియమించారు.జ‌గన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఒక ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు.ఒక క్రైస్తవుడిని టీటీడీ ఛైర్మన్ గా ఎలా నియమిస్తారని హిందూవాదులు అగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు పత్రికల్లో పతాక స్థాయిల్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు. కల్తీ జరిగిందని కానీ.. చేపనెయ్యి.. కొవ్వు కలిసినట్లుగా ఎక్కడా లేదు. ఒకరి గుర్తింపును.. ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసి ఏజెన్సీలు సైతం ఉన్నాయి. వాటి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ సుబ్ర‌మ‌ణ్య స్వామి హెచ్చ‌రించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది