YS Jagan : వైఎస్ జ‌గ‌న్‌ కు మళ్లీ ఆ సానుభూతి లభిస్తుందా..? అప్పుడేమో బాబాయ్ – ఇప్పడేమో చెల్లి ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : వైఎస్ జ‌గ‌న్‌ కు మళ్లీ ఆ సానుభూతి లభిస్తుందా..? అప్పుడేమో బాబాయ్ – ఇప్పడేమో చెల్లి ..!

YS Jagan : అప్పట్లో దేశమంతా కాంగ్రెస్ ఉంది. అన్నిటికి మించి కేంద్రంలో అధికారం ఇంకా నాలుగేళ్లు నిండుగా ఉంది.ఆ సమయంలో వైఎస్ జ‌గ‌న్‌ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీని పెట్టుకున్నారు. 2011 మే లో జరిగిన ఎన్నికల్లో పులివెందుల నుంచి వై.యస్.విజయమ్మ పోటీ చేస్తే కడప పార్లమెంటు నుంచి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేశారు.అయితే పులివెందుల నుంచి వై.యస్.విజయమ్మ మీద వివేకానంద రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.ఆయన అప్పటికి మంత్రి […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 January 2024,4:30 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : వైఎస్ జ‌గ‌న్‌ కు మళ్లీ ఆ సానుభూతి లభిస్తుందా..? అప్పుడేమో బాబాయ్ - ఇప్పడేమో చెల్లి ..!

YS Jagan : అప్పట్లో దేశమంతా కాంగ్రెస్ ఉంది. అన్నిటికి మించి కేంద్రంలో అధికారం ఇంకా నాలుగేళ్లు నిండుగా ఉంది.ఆ సమయంలో వైఎస్ జ‌గ‌న్‌ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీని పెట్టుకున్నారు. 2011 మే లో జరిగిన ఎన్నికల్లో పులివెందుల నుంచి వై.యస్.విజయమ్మ పోటీ చేస్తే కడప పార్లమెంటు నుంచి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేశారు.అయితే పులివెందుల నుంచి వై.యస్.విజయమ్మ మీద వివేకానంద రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.ఆయన అప్పటికి మంత్రి కూడా.అలా ఆయన పోటీ చేస్తే జనమంతా జగన్ వైపు నిలబడ్డారు.ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సాగింది. దాంతో వివేకానంద ఓడిపోయారు. ఇక జగన్ ఎంపీ సీటులో పోటీ చేసి ఐదున్నర లక్షల మెజారిటీతో గెలిచారు. తిరిగి ఇన్నాళ్లకు వైయస్సార్ కుటుంబంలో మరో చీలిక వచ్చింది. ఆనాడు వైయస్సార్ వివేకానంద కుటుంబాలలో చీలిక వస్తే జనాలు వైఎస్ జ‌గ‌న్‌ వెంట ఉన్నారు. ఆ సానుభూతి వైఎస్ జ‌గ‌న్‌ కు తోడైంది. ఈసారి ఏకంగా వైయస్సార్ కుటుంబంలో నిలువుగా చీలిక వచ్చింది. అన్నా చెల్లెలు ఇద్దరు పోటాపోటీగా ముందుకు వచ్చారు. ఒకరు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత అయితే మరొకరు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు. వాళ్ళ ఇద్దరు 2024 ఎన్నికల్లో తలపడునున్నారు. అయితే తాజాగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన విద్యా సదస్సులో కాంగ్రెస్ కి చరిత్ర పాఠాలు ఎన్ని చెప్పినా బుద్ధి రాలేదు అని అన్నారు. గతంలో నా సొంత చిన్నాన్నను మా పైన పోటీకి దించి పరాభవం పాలు అయ్యారు. ఇప్పుడు ఏకంగా నా సోదరిని నామీద పోటీగా దించారు. అయినా దేవుడు అన్ని చూసుకుంటారు. కాంగ్రెస్ కి మరోసారి పరాభవం జరగటం తధ్యమని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ కి విభజించి పాలించు అన్నది బాగా అలవాటు అన్నారు. ఏపీని చీల్చింది కాంగ్రెస్ నే అని, ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా రెండుగా చీల్చింది అని ఆయన అన్నారు. అన్ని ప్రజలు, దేవుడు గమనిస్తున్నారు అని ఆయన అన్నారు. అంటే ఆయన సోదరి షర్మిల విషయంలో పూర్తి తప్పు కాంగ్రెస్ దే అని అంటున్నారు. తన చెల్లెను కాంగ్రెస్ తన మీదకు ఎగదోస్తుంది అన్నది ఆయన ఆరోపణ. ఈసారి కూడా కాంగ్రెస్ కు కుతంత్రాలు, కుట్రలు సాగవని ఆయన నిబ్బరంగా ఉన్నారు. ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీ అని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే జగన్ పట్ల జనంలో సానుభూతి ఈ విషయంలో ఉంటుందా అనేది చర్చ. ఇప్పటికీ 13 ఏళ్ల క్రితం జగన్ అనే కొత్త నేతను యువకుడిని జనాలు ఆదరించారు. ఆయనకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని జనాలు ఆయనకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు చూస్తే జగన్ ఐదేళ్లపాటు విపక్ష నేతగా, మరో ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. జగన్ ఏమిటో జనాలు చూశారు ఆయన పాలన చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలు తన ప్రభుత్వం మీద ప్రయోగిస్తుందని, తన కుటుంబం మీద చేస్తుందని జగన్ అంటున్నారు.

అయితే ఈసారి వైఎస్ జ‌గ‌న్‌ కి జనాల నుంచి అంతే స్థాయిలో సానుభూతి లభిస్తుందా అన్నది చర్చకు వస్తుంది. వైఎస్ జ‌గ‌న్‌ నా కుటుంబాన్ని చీల్చారు అని కాంగ్రెస్ తో పాటు టీడీపీ తదితర విపక్షాలు అని జనంలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఒక సెంటిమెంట్ గా కూడా బలంగా పనిచేసే అవకాశం ఉంది. అందుకే జగన్ తన సోదరిని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు అని జనంలోకి వస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ ఒంటరి పోరాటం చేస్తున్నారు జనాలు చూస్తున్నారు. కారణాలు ఏమైనా కూడా విపక్షాలు అన్ని కత్తి కట్టాయి. అయితే ఈ క్లిష్ట సమయంలో సొంత చెల్లెలు అన్నకు ఎదురుగా నిలబడి విమర్శలు చేస్తే అది జనంలో వేరే అర్థాలకు వెళుతుంది. ఈ సమయంలో ఆమె ఉండాల్సింది అన్న వైపు కదా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి వై.ఎస్.షర్మిల గత ఎన్నికల్లో అన్న పక్కన నిలబడి విజయంలో భాగమయ్యారు. ఇప్పుడు ఎదురు నిలిచి అన్నకు మళ్ళీ విజయం దక్కేలా చేస్తారేమో అని చర్చ నడుస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది