Kesineni Nani : కేసినేని నాని టీడీపీకి రాజీనామా చేసే డేట్ ఇదే?
Kesineni Nani : టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల నుంచి కేశినేని నాని టీడీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. అలాగే.. వైసీపీ ఎమ్మెల్యేలను మెచ్చుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనను మెచ్చుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతలకు ఈ విషయం మింగుడు పడటం లేదు. తాజాగా ఆయన టీడీపీ అధిష్టానానికి సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో ఏ పిట్టల దొరకు అయినా మీరు టికెట్ ఇవ్వొచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తా. నాకు ఎలాంటి బాధ లేదు. ప్రజలు కోరుకుంటే చాలు నేను గెలుస్తా అని పరోక్షంగా టీడీపీ పార్టీకి సవాల్ విసిరారు. నా మాటలను పార్టీ ఎలా అయినా తీసుకోనీ.. నాకు ఎలాంటి భయం లేదు. నేను ఎవరితో అయినా కలిసి పనిచేయడానికి సిద్ధం. అభివృద్ధి కోసం నాకు ఏ పార్టీలతో సంబంధం లేదన్నారు. టీడీపీ నుంచి విజయవాడ స్థానం నుంచి రెండుసార్లు కేశినేని నాని ఎంపీగా గెలిచారు.
Kesineni Nani : టీడీపీ తరుపున రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని
2014 లో గెలిచారు. మళ్లీ 2019 లోనూ గెలిచారు. కానీ.. ఆ తర్వాత ఎందుకో టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆయనకు పొసగలేదు. దీంతో కొన్నేళ్ల నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. టీడీపీ పార్టీపై, అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఇటీవల దాన్ని వెల్లగక్కారు. వైసీపీ ప్రభుత్వ పనితీరును మెచ్చుకొని విజయవాడ రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని ప్రకటించి మరో షాక్ ఇచ్చారు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.