Yanamala : ఏపీలో రాష్ట్రపతి పాలనకు ఇదే సరైన సమయం.. యనమల షాకింగ్ కామెంట్స్
Yanamala : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. ప్రభుత్వం ఆదేశాలతోనే.. పోలీసుల అండతోనే ఏపీలోని టీడీపీ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.

tdp senior leader yanamala ramakrishnudu about presidential rule in ap
ఇలా.. ఒక పార్టీని టార్గెట్ చేసుకొని ప్రభుత్వం ఇలా చేయడం శోచనీయం అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచక విధానాలకు కేంద్రమే సమాధానం చెప్పాలని ఆయన కోరారు.
Yanamala : పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారు
పోలీసులు, వైసీపీ నేతలు కుమ్మక్కయి.. ఇలా లా అండ్ ఆర్డర్ ను బ్రేక్ చేశారని యనమల అన్నారు. ఇలా.. ఒక పార్టీపై విచక్షణారహితంగా దాడులు చేయడం సరికాదని… ఈ సమయంలోనే ఆర్టికల్ 356ను వినియోగించుకోవాని.. ఏపీలో రాష్ట్రపతి పాలనకు ఇదే సరైన సమయం అని యనమల స్పష్టం చేశారు. వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని.. కేంద్రాన్ని కోరారు.