Telangana Results 2024 : తెలంగాణలో కాంగ్రెస్ 8 , బీజేపీ 6 హోరాహోరీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Telangana Results 2024 : తెలంగాణలో కాంగ్రెస్ 8 , బీజేపీ 6 హోరాహోరీ..!

Telangana Results 2024 : తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. వంశీకృష్ణ 816 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,9:35 am

ప్రధానాంశాలు:

  •  Telangana Results 2024 : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ..!

Telangana Results 2024 : తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. వంశీకృష్ణ 816 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో ఉన్నారు.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్ విడుదలయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు అధికారులు. ఈ ప్రక్రియ దాదాపు అరగంటపాటూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎంలను లెక్కించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలో తొలి ఫలితం విడుదలైంది.

Telangana Results 2024 తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీ

Telangana Results 2024 : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ..!

పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఆధిక్యం తగ్గింది. బీజేపీ స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి నగేష్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా పేరున్న మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో ఉన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది