Telugu Desam – Janasena : సంక్రాంతి తర్వాత జనసేన, టీడీపీ పొత్తు క్యాన్సిల్..!!
Telugu Desam – Janasena : జనసేన, టీడీపీ తో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం సామాజిక ఓట్లు చీల్చిపోకుండా ఉండడమే. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సామాజిక వర్గ ఓట్లు చీలీయి. ఇప్పుడు అలా కాకుండా ఉండాలని జనసేన, టీడీపీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎగబడ్డారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పొత్తు అడిగినప్పుడు నాకు ఇన్ని సీట్లు కావాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. […]
Telugu Desam – Janasena : జనసేన, టీడీపీ తో పొత్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం సామాజిక ఓట్లు చీల్చిపోకుండా ఉండడమే. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక సామాజిక వర్గ ఓట్లు చీలీయి. ఇప్పుడు అలా కాకుండా ఉండాలని జనసేన, టీడీపీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇక పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎగబడ్డారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పొత్తు అడిగినప్పుడు నాకు ఇన్ని సీట్లు కావాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పొత్తు కోసం చంద్రబాబును అడిగినప్పుడు బీజేపీ ని తీసుకొస్తావా అని అడిగారు. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీ చాప కింద నీరు లాగా సపోర్ట్ చేయడంతో వైసీపీ గెలిచిందని అన్నారు. 2024లో మోడీ మళ్ళీ గెలుస్తారు అందుకే ఇప్పుడు బీజేపీ సపోర్ట్ ఉండాలని చంద్రబాబు అంటున్నారు.
జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటే జగన్ ను ఓడించగలమని సర్వేలే ఉండడంతో చంద్రబాబు దానిమీద స్ట్రాంగ్ గా నిలబడ్డారు. 2024 లో పవన్ కళ్యాణ్ బీజేపీని తమ పార్టీ పొత్తు లోకి తీసుకొస్తారా లేక టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళతాయా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ, జనసేన పార్టీ వలన కొన్నిచోట్ల టీడీపీ తూట్లు పొడుస్తుందని జనసేన పార్టీ వాళ్ళు విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని చోట్ల జనసేన పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు చింపడం, తెలుగుదేశం పార్టీ గ్రూప్ తగాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక నియోజకవర్గం టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలోని వాళ్లు రెండు వర్గాలుగా చీలిపోయి తన్నుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేన ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది. చులకనగా అయ్యే పరిస్థితి వస్తుంది.
దీంతో టీడీపీ, జనసేన పొత్తు బీటలు వారుతుందని కచ్చితంగా పొత్తు క్యాన్సిల్ అయి తీరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి తర్వాత జనసేన పార్టీ బీజేపీ ని తీసుకొచ్చి చంద్రబాబు చేతిలో పెడితే పొత్తు ఉంటుంది. లేదంటే ఆ పొత్తులు ఓకే చేసుకోకపోతే ఖచ్చితంగా టీడీపీ, జనసేన పొత్తు క్యాన్సిల్ చేసుకుంటాయని అంటున్నారు. ఒకపక్క షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చే అవకాశం ఉంది. వైయస్సార్ సీపి ఓట్లను మాత్రమే చీలిస్తే చంద్రబాబుకు ఎటువంటి నష్టం ఉండదు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే టీడీపీకి దెబ్బ పడే అవకాశం ఉంటుంది. దీంతో చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు ఉంటే ఎలాగైనా అధికారంలోకి రావచ్చని చూస్తున్నారు.