MPTC ZPTC Elections : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. నామినేష‌న్ , పోలీంగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MPTC ZPTC Elections : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. నామినేష‌న్ , పోలీంగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2025,10:30 am

ప్రధానాంశాలు:

  •  ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

  •  ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల డేట్ వచ్చేసిందోచ్

  •  MPTC ZPTC Elections : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. నామినేష‌న్ , పోలీంగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..!

MPTC ZPTC Elections  : ఆంధ్రప్రదేశ్‌లోని Andhra pradesh  ఖాళీగా ఉన్నస్థానిక స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 28న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 3 ఎంపీటీసీ, 2 జడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రామకుప్పం, కారంపూడి, విడవలూరు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, పులివెందుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లో జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే కొండపూడి, కడియపులంక గ్రామాల్లో సర్పంచ్ పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి.

MPTC ZPTC Elections ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందోచ్ నామినేష‌న్ పోలీంగ్‌ ఫ‌లితాల తేదీలు ఇవే

MPTC ZPTC Elections : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. నామినేష‌న్ , పోలీంగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..!

MPTC ZPTC Elections :  ఎన్నికల జాతర మొదలుకాబోతుంది

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ దాఖలుల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా విడుదల తదితర ప్రక్రియల అనంతరం ఆగస్టు 12న ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల ఫలితాలను ఆగస్టు 14న ప్రకటించనున్నారు. ఇది స్థానిక రాజకీయాల్లో కీలకమైన పరిణామంగా మారనుంది.

ఇక సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే.. ఆగస్టు 10న కొండపూడి, కడియపులంక గ్రామాల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఫలితాలను కూడా ప్రకటిస్తారు. గ్రామీణ పాలనకు స్థిరత్వం, ప్రజా ప్రతినిధులకు బాధ్యతలతో కూడిన నాయకత్వం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖాళీ స్థానాల ఎన్నికలను నిర్వహిస్తోంది. ఈ ఎన్నికలు స్థానికంగా రాజకీయ ఉత్సాహాన్ని రేకెత్తించనున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది