YS Jagan : తన బర్త్ డే కోసం 600 కేజీ ల కేక్ కట్ చేయడం మీద జగన్ స్పందన ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : తన బర్త్ డే కోసం 600 కేజీ ల కేక్ కట్ చేయడం మీద జగన్ స్పందన ఇదే !

 Authored By sekhar | The Telugu News | Updated on :21 December 2022,1:38 pm

YS Jagan : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది 50వ పుట్టినరోజు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాలలో ఉన్న పార్టీ కార్యాలయలలో కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కొన్నిచోట్ల రక్తదానం మరియు మొక్కలు నాటడం ఇంకా అన్నదాన కార్యక్రమాలతో పాటు స్కూల్ విద్యార్థులకు ఆటల పోటీలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే విజయవాడలో 600 కేజీల భారీ కేక్ ఊరేగించి మరీ కట్ చేశారు. ఎమ్మెల్సీ తలసీల రఘురాం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైసీపీ రంగులతో తయారు చేయించిన ఈ కేక్ నీ గొల్లపూడి లో ఊరేగించారు. భారీ వాహనంపై బెలూన్ లు కట్టి కేక్ వీధుల్లో తిప్పడం జరిగింది. అనంతరం ఈ భారీ కేక్ నీ కట్ చేసి పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులకి పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసిపి పార్టీ నేతలు… కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉంటే ఏకంగా 600… కేజీల భారీ సైజులో కేక్ కట్ చేయడం పట్ల సీఎం జగన్ అనవసరంగా ఎందుకు ఇటువంటి ఆర్భాటాలు చేస్తున్నారని నాయకులను మందలించినట్లు పార్టీలో టాక్.

This is Jagan's reaction to cutting a 600 kg cake for his birthday

పుట్టినరోజు వేడుకలు కంటే వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యం. ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలని జగన్ సూచించినట్లు.. వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు ప్రత్యేకంగా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో నేడు పుట్టినరోజు కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో విదేశాలలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రధాని మోడీ.. సీఎం జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా విషెస్ తెలియజేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది