YS Jagan : జగన్ కి వరస సెల్యూట్ లు కొడుతున్నారు.. ఈ సీన్ చూస్తే తప్పులేదు అంటారు మీరు..!
YS Jagan : ఏపీ కేబినేట్ తాజాగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా కేబినేట్ లో పలు అంశాలు చర్చకు వచ్చాయి. పలు నిర్ణయాలను కూడా తీసుకున్నారు. కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు, జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నిజానికి.. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పలు డిమాండ్లను సీఎం జగన్ నెరవేర్చడంపై వాళ్లు చాలా సంతోషం వ్యక్తం చేశారు.
అందులో ఒకటి వైద్య విధాన పరిషత్.. ఏపీ వీవీపీని ప్రభుత్వ శాఖగా మారుస్తూ ఏపీ కేబినేట్ నిర్ణయం తీసుకోవడంపై ఏపీవీవీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఏకంగా 13 వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అన్నారు. ఇక నుంచి ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు ప్రక్రియ జరగనుంది. దీంతో ఏపీవీవీపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.ఏపీ కేబినేట్ మీటింగ్ లో నిరుద్యోగులకు కూడా ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడం కోసం ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను గుర్తించడంపై ఏపీ నిరుద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
YS Jagan : నిరుద్యోగులకు ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం
త్వరలోనే టెట్, డీఎస్సీ, పోలీస్ శాఖ, వర్సిటీల్లో సిబ్బంది, సచివాలయాలు, మెడికల్ అండ్ హెల్త్ శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ కానున్నాయి. అలాగే.. జీపీఎస్ అమలుపై గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపింది. ఈ జీపీఎస్ విధానం వల్ల అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. సీపీఎస్ బదులు జీపీఎస్ విధానం అనేది అందరికీ ఉపయోగమైనది, 50 శాతం కనీస పింఛన్, డీఏలు వర్తించేలా ఈ కొత్త విధానాన్ని తీసుకురావడంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.