Thalliki Vandanam : తల్లికి వందనం విధి విధానాలు ఏంటి.. అర్హులు ఎవరంటే..!
ప్రధానాంశాలు:
Thalliki Vandanam : తల్లికి వందనం విధి విధానాలు ఏంటి.. అర్హులు ఎవరంటే..!
Thalliki Vandanam : ఏపీ ప్రభుత్వం AP Govt ఇచ్చిన పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి తోడుగా త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15000 చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా.. అందరికీ ఈ పథకం కింద రూ.15 వేలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.
![Thalliki Vandanam తల్లికి వందనం విధి విధానాలు ఏంటి అర్హులు ఎవరంటే](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Thalliki-Vandanam-1.jpg)
Thalliki Vandanam : తల్లికి వందనం విధి విధానాలు ఏంటి.. అర్హులు ఎవరంటే..!
Thalliki Vandanam ఇవే నిబంధనలు..
వచ్చే విద్య సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికంగా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగుతోంది.
గతంలో YCP వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు. విద్యుత్ వినియో గం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. తల్లికి వందనం నిధులు జూన్ లో జమ అవుతాయని స్పష్టత వచ్చినా.. అర్హత, మార్గదర్శకాల పైన లబ్ది దారులలో మాత్రం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.