Vangalapudi Anitha : హోం మంత్రి అనితకి బాలయ్య వార్నింగ్.. సీఎం దగ్గరకు పంచాయతీ..?
Vangalapudi Anitha : ఏపీలో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి రావడంతో సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమికి చెందిన మంత్రులు వారి వారి పనుల్లో నిమగ్నం అవుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కాని తాజాగా అనిత అనుచరులు విశాఖలోని ఓ హోటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే […]
ప్రధానాంశాలు:
Vangalapudi Anitha : హోం మంత్రి అనితకి బాలయ్య వార్నింగ్.. సీఎం దగ్గరకు పంచాయతీ..!
Vangalapudi Anitha : ఏపీలో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి రావడంతో సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమికి చెందిన మంత్రులు వారి వారి పనుల్లో నిమగ్నం అవుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కాని తాజాగా అనిత అనుచరులు విశాఖలోని ఓ హోటల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారని అంటున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని సమాచారం.
Vangalapudi Anitha బాలయ్య అంటే లెక్క లేదా..
అనిత అనుచరులు.. బాలయ్యకు పరిచయస్తుడు అన్నట్లు చెబుతున్న హోటల్ యజమాని మధ్య ఓ వ్యవహారం జరిగిందని, అది కాస్తా ఏకంగా ముఖ్యమంత్రి పేషీకి చేరిందని అంటున్నారు. అన్నవరంలోకి ‘వన్’ రెస్టారెంట్ కు హోం మంత్రి అనిత అనుచరులు, టీడీపీ నేతలు ఇటీవల వెళ్లారంట. అయితే వారు ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా అక్కడే గంటల తరబడి కూర్చున్నారంట. దీంతో… పీక్ అవర్స్ లో ఆర్డర్ ఇవ్వకుండా, గంటల తరబడి కూర్చుంటే నష్టపోతామని ఆ హోటల్ సిబ్బంది.. అనిత అనుచరులకు చెప్పారని అంటున్నారు. దీంతో… ఆగ్రహించిన సదరు టీడీపీ నేతలు… హోటల్ మేనేజర్, సిబ్బందితో ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తమ హోటల్ లో జరిగిన ఈ గొడవ విషయాన్ని అమెరికాలో ఉన్న యజమాని దృష్టికి తీసుకెళ్లారంట సిబ్బంది. దీంతో వెంటనే ఆయన ఈ విషయాన్ని తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు! దీంతో… బాలయ్య నుంచి హోంమంత్రి అనితకు ఫోన్ వెళ్లిందని చెబుతున్నారు. అయినప్పటికీ ఈ గొడవ సద్దుమణగలేదని సమాచారం. స్వయంగా నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగినప్పటికీ వ్యవహారం సద్దుమణగక పోవడంతో… ఈ పంచాయతీ కాస్తా ముఖ్యమంత్రి పేషీకి చేరిందని చెబుతున్నారు. దీంతో… బాలయ్యను హోంమంత్రి అనిత లైట్ తీసుకున్నారా అనే చర్చా తెరపైకి వచ్చింది. మరి దీనిపై టీడీపీ నేతలు ఏమైన స్పందిస్తారా అనేది చూడాలి.