Varma : పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేస్తున్న వర్మ… క్షేత్రస్థాయిలో అనుమానం…!
ప్రధానాంశాలు:
Varma : పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేస్తున్న వర్మ... క్షేత్రస్థాయిలో అనుమానం...!
Varma : ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో తన గెలుపు బాధ్యతలను పవన్ కళ్యాణ్ పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మపై ఉంచడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయితే టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉండడం లేదని జనసేన నాయకులు మరియు కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. అలా అని ఈ విషయాన్ని ఇప్పుడు బయట మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు.మరోవైపు ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కష్టమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Varma : పిఠాపురంలో పవన్ కొంపముంచుతున్న వర్మ…
దీంతో జనసేన కార్యకర్తల్లో కలవరం మొదలైంది. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవకపోతే శాశ్వతంగా ఆయన రాజకీయాలకు సమాధి కట్టినట్టే అవుతుందని చర్చలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగ గీత ఓడిస్తుంది అనే మాట కంటే టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మ కొంపముంచుతారు అనే వార్తలే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.కానీ జనసేనకు వ్యతిరేకంగా ఉన్నట్లు వర్మ ఎక్కడా కూడా ప్రవర్తించలేదు. కానీ వర్మ జనసేనకు అనుకూలంగా పవన్ కోసం నిలబడినట్లు లేదని టీడీపీ శ్రేణులు గుర్తించాయి. దీంతో వర్మ మనసెరిగిన టీడీపీ నాయకులు కార్యకర్తలు నడుచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని పట్టుదల వర్మలో కనిపించడం లేదని జనసేన నాయకులు వాపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే శాశ్వతంగా ఈ సీటు జనసేన పార్టీకే సొంతమవుతుందని టీడీపీ శ్రేణులు భయపడుతున్నట్లుగా సమాచారం.
Varma : పవన్ గెలుపు ఈసారి కూడా కష్టమేనా…
ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కోసం మనమెందుకు చేయాలి అనే ఆలోచనలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీంతో క్షేత్రస్థాయిలో ఎక్కడో తేడా జరుగుతుందనే ఆందోళన జనసేన నేతల్లో కనిపిస్తోంది. అంతేకాక క్షేత్రస్థాయిలో జనసేనకు పార్టీ నిర్మాణం లేకపోవడంతో పిఠాపురం నియోజకవర్గంలో పూర్తిగా వర్మపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ వర్మ మాత్రం పవన్ కళ్యాణ్ కోసం మనస్ఫూర్తిగా పనిచేయకుండా చేస్తున్నామంటే చేస్తున్నాం అనే లెవల్ లో నడిపిస్తున్నారు . దీంతో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం లో వర్మ వలన సానుకూల రాజకీయ వాతావరణం కనిపించడం లేదనిజనసేన నేతలు వాపోతున్నారు. మరి ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు ఏమవుతుందనేది ఆలోచించ తగ్గ విషయం. మరి ఈ విషయంపై మీద అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.