Venu Swamy : జగన్‌కి అప్పుడు 4 పూజలు చేశా.. దెబ్బకు జైలు నుంచి బయటికి వచ్చాడు.. వేణు స్వామి షాకింగ్ వ్యాఖ్యలు
Venu Swamy : వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. వేణు స్వామి అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ తన దగ్గర జాతకం చూపించుకున్న వాళ్లే అని, తాను చాలామందికి రాజశ్యామల యాగం చేశానని.. ఆ యాగం చేయడం వల్లనే చాలామంది ఉన్నత పదవులను పొందారని, సినిమా వాళ్లు అయితే స్టార్లు అయ్యారని చెబుతాడు వేణు స్వామి. రష్మిక మందన్నాకు తాను రాజశ్యామల యాగం చేయడం […]

Venu Swamy : వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. వేణు స్వామి అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ తన దగ్గర జాతకం చూపించుకున్న వాళ్లే అని, తాను చాలామందికి రాజశ్యామల యాగం చేశానని.. ఆ యాగం చేయడం వల్లనే చాలామంది ఉన్నత పదవులను పొందారని, సినిమా వాళ్లు అయితే స్టార్లు అయ్యారని చెబుతాడు వేణు స్వామి. రష్మిక మందన్నాకు తాను రాజశ్యామల యాగం చేయడం వల్లే తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిందని కూడా చెబుతాడు వేణు స్వామి. అయితే.. జగన్ సీఎం కాకముందు జగన్ కోసం వేణు స్వామి పలు పూజలు చేశాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసం నాలుగు సార్లు రాజశ్యామల, భగాలముఖి యాగం చేశారు. 2019 లో జగన్ ముఖ్యమంత్రి కాగానే తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంత్రి అవుతారని ముందే చెప్పారు వేణు స్వామి.
దాడిశెట్టి రాజాకు భగాలముఖి, రాజశ్యామల రెండు యాగాలు నేను చేయించా. ఆయన కోసం వాళ్ల తమ్ముడు దాడిశెట్టి శీను పూజ చేయించాడు. దాడిశెట్టి రాజా.. జగన్ సీఎం కావాలని నాలుగు సార్లు రాజశ్యామల, భగాలముఖి యాగం చేయంచారు. నాతోనే చేయించారు. నేను వైజాగ్ లో చేశాను. రాజకు జగన్ అంటే చాలా ఇష్టం. ఆయన అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. 2018, 2019 లో ఎన్నికలు కాకముందే నాలుగు సార్లు ఆ యాగాలు చేశాను. వైజాగ్ లో భీమిలి వెళ్లే రోడ్డు ఈ కార్యక్రమం చేశాం. రాజాతో పాటు మరో ఎమ్మెల్యే కూడా ఇద్దరూ కలిసి జగన్ సీఎం కావాలని చేయించారు. ఆ తర్వాత దాడిశెట్టి రాజా తమ్ముడు శీను.. తన అన్న కోసం చేయించారు.. అంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి.

#image_title
Venu Swamy : చంద్రబాబు చెప్పినా వినలేదు
కొందరు ఇలాంటివి నమ్మరు. అందులో చంద్రబాబు లాంటోళ్లు అస్సలు నమ్మరు. చంద్రబాబుతో రాజశ్యామల చేయించడానికి బాలకృష్ణ తెగ ప్రయత్నాలు చేశారు. కానీ.. ఆయన వినలేదు. మనం యాగం చేద్దామని బాలకృష్ణ నాతో అన్నారు. దీంతో మీరు ఆయన్ను ఒప్పించండి. మనం చేద్దాం అని నేను చెప్పిన. అంటే.. ఆయన నేను కూర్చోను అని చెప్పాడు. మీరు ఎమ్మెల్యే అయితరు కానీ.. మీ పార్టీ రూలింగ్ లో ఉండదు. అని చెప్పి నేను చీరాలలో బాలకృష్ణ కోసం యాగం చేయించా. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కానీ.. టీడీపీ గెలవలేదు.. అంటూ చంద్రబాబు గురించి వేణు స్వామి చెప్పుకొచ్చారు.