Venu Swamy : 2024 ఎన్నికల్లో వైయస్ జగన్ ఎన్ని సీట్ల మెజారిటీతో గెలవబోతున్నారో చెప్పిన వేణు స్వామి…!
ప్రధానాంశాలు:
Venu Swamy : 2024 ఎన్నికల్లో వైయస్ జగన్ ఎన్ని సీట్ల మెజారిటీతో గెలవబోతున్నారో చెప్పిన వేణు స్వామి...!
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఆయన కూడా ఒక సెలబ్రిటీగా మారారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీ జాతకాలు చెప్పినా ఆయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. వేణు స్వామి చెప్పిన వాటిలో కొన్ని నిజమయ్యాయి. మరికొన్ని జరగలేదు. అయితే ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని నిజం అవటం వలన ఆయన చెప్పేవి నిజమే అని కొందరు నమ్ముతున్నారు. ఇక తాజాగా అయినా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024, 2029 ఎన్నికల్లో మళ్ళీ సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని, 2024 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు.
ఇక చంద్రబాబు నాయుడు మరియు ఆయన తెలుగుదేశం పార్టీ అంతరించిపోతాయని ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు. 2024 లో కేసీఆర్ లా వైఎస్ జగన్ మారబోతున్నారని, ఆయన అందరిని కంట్రోల్ చేస్తారని, మళ్లీ సీఎం గా గెలుస్తారని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించి ఇక్కడ రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాజకీయంగా పెద్దగా ఎదగలేరని చెప్పారు. వైయస్ షర్మిల తన అన్న వైఎస్ జగన్ తో ఉంటే ఆమె జీవితం బాగుంటుంది అని ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ మరియు కేసీఆర్ కొడుకు రాజకీయంగా అభివృద్ధి చెంది అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని వేణు స్వామిని అడిగినప్పుడు వారిద్దరి జాతకాల ప్రకారం అలాంటిది జరిగే అవకాశం తక్కువ అని చెప్పారు.
ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలిచినప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని చెప్పారు. ఇక నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన 2024లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉండవచ్చు కానీ ముఖ్యమంత్రి అయ్యేవరకు వెళ్లే అవకాశాలు లేవని వేణు స్వామి తెలియజేశారు. దీంతో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని అంటున్నారు. ఏపీలో వైయస్ జగన్ ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఒకవైపు వైఎస్ జగన్ ఒకవైపు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారు మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.