Venu swamy : 2024 మే తర్వాత వై.యస్.జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇదే.. సంచలన విషయాలు బయట పెట్టిన వేణు స్వామి..!!
Venu swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యారు. ఆయన చెప్పిన జాతకాలలో కొందరివి నిజం కావడంతో ఆయనను నమ్ముతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆయన చెప్పిన జ్యోతిష్యం బెడిసి కొట్టినట్లుగా కనబడుతుంది. అయినా కూడా ఆయన చెప్పే జ్యోతిష్యం వినడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జాతకం […]
ప్రధానాంశాలు:
Venu swamy : 2024 మే తర్వాత వై.యస్.జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇదే.. సంచలన విషయాలు బయట పెట్టిన వేణు స్వామి..!!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.
Venu swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యారు. ఆయన చెప్పిన జాతకాలలో కొందరివి నిజం కావడంతో ఆయనను నమ్ముతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆయన చెప్పిన జ్యోతిష్యం బెడిసి కొట్టినట్లుగా కనబడుతుంది. అయినా కూడా ఆయన చెప్పే జ్యోతిష్యం వినడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జాతకం గురించి తెలిపారు. వేణు స్వామి మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్లో లేడీ మంత్రికి టికెట్ రాకపోవచ్చు అని, ఒకవేళ వచ్చిన ఆమె గెలవక పోవచ్చు అని అన్నారు. ఆ మహిళా మంత్రికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. ఇక జ్యోతిష్యం ప్రకారంగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. 2024లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి తప్పకుండా గెలుస్తారు అని అన్నారు.
మే తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తానని వేణు స్వామి అన్నారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత సంచలన విషయాలు బయటపెడతానని వేణు స్వామి తెలిపారు. ప్రశాంత్ కిషోర్ జాతకం అస్సలు బాగోలేదని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు బాగుంటాయి అని అన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి గండం ఉందని, నమ్మకద్రోహం జరిగే అవకాశం ఉందని, ఆయన మరికొద్ది నెలలో గద్దె దిగబోతున్నారని వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థానంలో ఎవరు సీఎం పదవిని తీసుకుంటారో చెప్పనని, అది కాంట్రవర్సీలకు దారితీస్తుందని వేణు స్వామి తెలిపారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు.
అప్పులు ఉన్న అభివృద్ధి తప్పకుండా ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభావం తగ్గుతుంది అని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అనధికారంగా ఉంటాయని, కొంతమందికి అమరావతి రాజధాని గా ఉంటుందని అన్నారు. 2024 లో కూడా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏంటో తెలియదు అని అన్నారు. 2024 లో రాజకీయాన్ని వదిలిపెట్టి తిరోగమనం చేసే నాయకులు ఎంతోమంది ఉన్నారని, జాతకంలో ఉన్నది చెబుతున్నానని, వై.యస్.జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి నాకు అవసరం లేదని, అతడి జాతకం ఎలా ఉందో చెబుతున్నాను అని వేణు స్వామి అన్నారు. 2024లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. మే తర్వాత వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత సంచలన విషయాలు బయట పెడతానని వేణు స్వామి తెలిపారు.